Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
టీఆర్ఎస్ పార్టీ చొరవ వల్లే రాష్ట్రంలో అటవీ శాఖ అధికారులు పోడు భూముల్లో ట్రెంచ్ పనులు నిలిపేశారని ఓడీసీఎంఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా వైస్ చైర్మెన్ దేశిడి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ దిగొచ్చి ట్రెంచ్ పనులు ఆపించారని ఎమ్మెల్యే సీతక్కతోపాటు కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మనబోయిన వేణు అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశానికి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే సీతక్కకు, కాంగ్రెస్ నాయకులకు ఏం మాట్లాడాలో తెలియడం లేదని మండిపడ్డారు. ఏజెన్సీ గ్రామాల్లో పోడు భూముల్లో అటవీ శాఖ అధికారులు ట్రెంచ్ పనులు చేపట్టిన సందర్భంగా సీతక్క ఎప్పుడూ గిరిజనులకు అండగా నిలిచిన దాఖలాల్లేవని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిస్తామని ఇచ్చిన హామీ మేరకే సీఎం కేసీఆర్ పోడు భూముల్లో ట్రెంచ్ పనులు నిలిపేయాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కలిసి రోడ్లు, పనులు మంజూరీ కోసం సీతక్క తిరుగుతున్న సందర్భాలున్నాయని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలిచ్చే విషయంలో టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క మాట ఉన్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగౌతుందని చెప్పారు. సమావేశంలో సర్పంచ్‌లు ఈసం కాంతమ్మ స్వామి, రమేష్‌నాయక్, టీఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి నెహ్రూనాయక్, నాయకులు పూల యాదగిరి, వీరన్న, బాల కొమురు, స్వరూప, స్వామి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.