Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలో పోలీసులు డేగ కన్ను వేశారు. ఛత్తీస్ఘడ్ ప్రాంతం నుంచి వలస వచ్చి అడవుల్లో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న గొత్తికోయ జనం మీద ప్రత్యేక నిఘా పెట్టారు. మండలంలోకి ఎవరొ స్తున్నారు? ఎవరు వెళ్తున్నారు? అన్న అంశాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తు న్నారు. ఎస్సై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్, సివిల్ పోలీ సులు సోమవారం తెల్లవారుజామునే జలగలంచ గొత్తికోయగూడెంలో కార్చన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో కాటా పూర్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. మండలంలో మావోయిస్టుల కదలికలపై ఆరా తీస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం లోని ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు, మావో యిస్టులకు నడుమ శనివారం ఎదురు కాల్పులు జరిగిన నేపథ్యంలో గోదావరి దాటి మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న సమాచారంతో గోదావరి ఫెర్రీ పాయింట్ల వద్ద నిఘాను తీవ్రం చేశారు. గోదావరి పరిసర ప్రాంతాల్లోనూ నిఘా పెంచారు. అపరిచితులొస్తే సమాచారం ఇవ్వాలని కోరుతూ గొత్తికోయ ఆదివాసీ గిరిజనులకు కౌన్సిలింగ్ చేశారు. ఏటూరునాగారం-తాడ్వాయి, తాడ్వా యి-పస్రా మార్గాల్లో ప్రత్యేక పోలీసు బలగాలతో గస్తీ నిర్వహించారు. ఛత్తీస్ఘడ్ నుంచి రాకపోకలు సాగిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లోనూ సోదా చేశారు. మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో మావోయిస్టుల కదలికలపై పోలీసులు, గ్రేహౌండ్స్ ప్రత్యేక బలగాలు డేగకన్ను వేశాయి. అడవులను జల్లెడ పడుతుండడం తో, ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం వణుకుతున్నారు.