Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేళ్లకే కాలం చెల్లిన తూము షటర్
- వారం రోజులైనా నోచుకోని మరమ్మతు
- పాత తూముపై నీటి వొత్తిడి..
- ప్రమాదపుటంచున కట్ట
- నాసిరకం పనులపై నాడే హెచ్చరించిన 'నవతెలంగాణ'
- కోట్ల నిధులు కాంట్రాక్టర్ పాలు..
- కలగా మినీ ట్యాంక్ బండ్
నవతెలంగాణ-నర్సంపేట
మాధన్నపేట పెద్ద చెరువుకు ప్రమాదం పొంచి ఉంది..రెండేళ్ల క్రితమే నిర్మించిన తూము షటర్‌కు అప్పుడే కాలం చెల్లింది. శిథిలమై ఊడిపోయింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం. ఐబీ ఇంజనీర్ల పనితనానికి నిలువుటద్ధంలా నిలిచింది. వెరసి పాత తూముపై నీటి వొత్తిడి పెరిగి కట్టకు గండి పడే ముప్పు లేకపోలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2016లో మిషన్ కాకతీయ రెండో విడుతలో పెద్ద చెరువు (మినీ ట్యాంక్ బండ్) పునరుద్ధరణకు రూ.7.51 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. కాంట్రాక్టర్ చేజిక్కిం చుకున్న శ్రీమాత కన్సస్ట్రక్షన్ కంపెనీ చెరువు పునరుద్ధరణ పనులను నాశిరకంగా చేపట్టి చేతులు తులుపేసుకొందని, ఇంజనీరు అధికారులు కోట్ల నిధులను ఈ కంపెనీకి అప్పనంగా కట్ట బెట్టారనే ఆరోపణలు అప్పట్లో వెలువడ్డాయి. ఫలితంగా రెండేళ్లకే తూము షటర్‌కు కాలం చెల్లింది. శిథిలమై కొద్ది రోజుల క్రితం ఊడి పోయింది. చెరువు నిర్మాణ పనుల్లో లోపించిన నాణ్యత ఏంటో ఆనతిలోనే బట్ట బయలైంది. అప్పట్లోనే 'నవతెలంగాణ దినపత్రిక 'నాణ్యతకు తిలోదకాలు. ప్రమాదపుటంచున తూము' అనే కథనం వెలువడించింది. అదే నేడు రుజువు చేస్తుంది. ప్రస్తుతం చెరువులో 7.6 అడుగులమట్టం నీరు ఉంది. రెండ్రోజులుగా రంగయ చెరువు నుంచి వాగు ద్వారా పెద్ద చెరువులోకి గోదావరి జలాలు చేరుకొంటున్నాయి. యా సంగి ఆయకట్టుతో పాటు వాగు పరివాహకంలో సాగు చేసిన వరి పంటకు కావాల్సిన నీరంది స్తామని రైతులకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భరోసానిచ్చాడు. షటర్ తూ ములో బిగిసిపోయి యాసంగి పంటకు నీరు అర్థాంతరంగా నిలిచి పోయింది. తూములో ఇరుక్క పోయిన షటర్‌ను 6 రోజుల క్రితం తీసేసి పాత తూము నుంచి ఆయకట్టుకు నీటి ని విడుదల చేస్తున్నారు. అప్పటికే శిథిలావస్థలో ఉన్న పాత తూముకు నీటి తీవ్రత పెరిగి ప్రమాదపుటంచున చేరు కొందని పెండ్యాల రాజు అనే గజ ఈతగాడు (మత్స్యకారుడు) చెప్పాడు. ఇతనిచే తూములో ఇరుక్కుపోయిన షట్టర్‌ను బయటకు తీయిం చారు. వారం రోజులు గడిచినా సాగు నీటి ఇంజనీరు అధికారులు ఇప్పటి వరకు మరమ్మత్తు చర్యలు చేపట్టకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తూము షటర్‌ను బిగించకపోతే పెరిగే నీటి తీవ్రతతో పాత తూము కుంగిపోయి కట్టకు గండి పడే ప్రమాదం లేకపోలేదని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కలగా మిగిలిన మినీ ట్యాంక్ బండ్..
మాధన్నపేట పెద్ద చెరువును పునరుద్ధరించి మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దాలనే ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంకల్పానికి గండిపడింది. మిషన్ కాకతీయ రెండో విడుతలో రూ.7.51 కోట్ల అంచనాతో నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం నర్సంపేట పట్టణ పరిధిలోకి వచ్చి న పెద్ద చెరువు 16.10 అడుగుల నీటి మట్టం సామార్థ్యం కాగా 2,407 ఎకరాల అధికారిక ఆయకట్టు ఉంది. రైతులకు రెండు పంటలకు సరిపడా సాగు నీరు, ఇక్కడి ప్రజలకు ఆహ్లాదాన్ని పరిచేందుకు 2016లో ఎమ్మెల్యే కాకపోయినా పెద్ది సుదర్శన్ రెడ్డి అప్పటి సాగునీటి శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుతో పట్టుపట్టి మరీ నిధులను తీసుకొచ్చాడు. మంత్రిచే మిషన్ కాకతీయ ఐకాన్‌గా నిల్వనున్న పైలాన్‌ను ఆవిష్కరింపజేశారు. కాంట్రాక్టర్ టెండర్లు ముగిసిన యేడాదిన్నరకు గానీ చెరువు పునరుద్ధరణ పనులను చేపట్టలేదు. చెరువులో లక్ష క్యూబిక్ మీటర్ల పూడిక మట్టి తీయాల్సి ఉండగా అందులో ఒక వంతు కూడా తీయలేదని రైతులు చెబుతున్నారు. ఇక పనుల్లో నాణ్యత లోపించిందని పలు చోట్ల కట్టకు పడిన గండ్లు, మత్తడిపై పెచ్చులూడుతున్న సీసీ రోడ్డు, నేడు శిథిలమైన తూము షట్టర్ రెండేళ్లలోనే రుజువు చేశాయి. చెరువు కట్ట నిర్మాణం చేసి మినీ ట్యాంకు బండ్‌గా తీర్చిదిద్దాలానే లక్ష్యం నెర వేరకుండా పోయింది. ఇప్పటికైనా సాగు నీటి శాఖ మంత్రి, ఎమ్మెల్యే, ఉన్నత ఇంజ నీరు అధికారులు ఈ చెరువుపై ప్రత్యేక దృష్టిపెట్టి అదనపు నిధులు మంజూరు చేసి మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.