Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
సమాజంలో అసమానతల తొలగింపు కోసం కృషి చేసిన మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ ఆశయాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆకాంక్షించారు. జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ సమీపంలోని ఆయన విగ్రహానికి కలెక్టర్ గౌతమ్‌తోపాటు ఎస్పీ కోటిరెడ్డి సోమవారం పూలమాలలు వేసి నివాళ్ల ర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారని, కార్మిక శాఖ మంత్రిగా పని చేస్తూ భారత-పాకి స్తాన్ నడుమ జరిగిన యుద్ధ సమయంలో రక్షణ శాఖ మంత్రిగా పని చేశాడని చెప్పారు. వ్యవ సాయ రంగాన్ని ఆధునీకరించడంలో పలు మార్పులు తీసుకొచ్చిన మహోన్నతుడిగా కీర్తించారు. ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అసమానతలుకు తావివ్వకూడదని చెప్పారు. విగ్రహాలకు వేసిన ముసుగులు తొలగింపజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి రావూరి రాజు, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కామ సంజీవరావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కుర్ర మహేష్, టీఎంఆర్పీఎస్ నాయకుడు కొండ ఎల్లయ్య, గిరిజన సామాజిక వేదిక అధ్యక్షుడు గుగులోతు కిషన్యక్, కెేవీపీఎస్ నాయకుడు దుడ్డెల రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ ఆధ్వర్యంలో.. పీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ నూనవత్ రాధ బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా చైర్మెన్ వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌నాయక్, సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిప్పర్తి శ్రీధర్, ఓబీసీ సెల్ టౌన్ అధ్యక్షుడు చెన్నమల్ల సీతారాములు, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు గాడిపెల్లి వెంకన్న, నాయకులు బోడ రవి, రామచంద్రు, వెంకటేశ్వర్లు, విజయలక్ష్మీ, భూక్య లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
మరిపెడ : మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ జయంతి నిర్వహించారు.
టీజీపీఏ ఆధ్వర్యంలో.. సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి టీజీపీఏ భద్రాద్రి జోన్ కార్యదర్శి ఐనాల పరశురాములు పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు పరశురాములు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించగా పరశురాములు మాట్లాడారు. కార్యక్రమంలో అసోసియేషన్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ జిన్నా పవన్‌కుమార్, నాయకులు కొమ్ము అన్నపూర్ణ, స్వామి, భూక్య నవీన్, మెట్టు శ్రీను, జినక శ్రీరాములు, వెంకన్న, భాషిపంగు మధు, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : వెలికట్ట పాలకేంద్రం (బాబు జగ్జీవన్‌రామ్ సెంటర్) వద్దనున్న విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం దళితరత్న సోమారపు ఐలయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీపీ చిన్న అంజయ్య, దళితరత్న గుండాల నర్సయ్య , సీఐ కరుణాకర్, జడ్పీటీసీ మంగళపెల్లి శ్రీనివాస్ అతిథులుగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో జాతీయ వేజ్ బోర్డ్ మాజీ చైర్మెన్ జన్ను జకార్య, మున్సిపల్ చైర్మెన్ రామచంద్రయ్య, జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ నాగవాణి, వెలికట్ట సర్పంచ్ పోసాని పుష్పలీల, ఎంపీటీసీ బత్తుల మల్లమ్మ యాకయ్య, జిల్లా డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మురళీ, విద్యాధికారి బుచ్చయ్య, ప్రజా, ఉద్యోగ సంఘాల నాయకులు మురళీకష్ణ, కిషన్‌నాయక్, భిక్షపతి, బందు నారాయణ, వెంకన్న, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
నర్సింహులపేట : మండలంలోని పెద్దనాగారం గ్రామంలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి మండల పరిషత్ అధ్యక్షురాలు టేకుల సుశీల యాదగిరిరెడ్డి పూలమాలలు వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ పులిచింతల కళావతి, ఎంపీటీసీ అజ్మీరా నాయకి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మెన్ బొబ్బ సంజీవరెడ్డి, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుజి వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.
నెల్లికుదురు : మండలంలోని మునిగలవీడు గ్రామంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఈసంపల్లి సైదులు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు బొజ్జ వెంకన్న, ముత్తయ్య, ఉప్పలయ్య, గణేష్, సునీల్, మోహన్, తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం : కేసముద్రం విలేజీలోని ఎన్టీఆర్ నగర్లో జగ్జీవన్ రామ్ జయంతిని కేవీపీఎస్ జిల్లా నాయకుడు జల్ల జయరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు బాదావత్ చంద్రు, బానోత్ గోవర్ధన్, జయశ్రీ, అనూష, ఫణి, నందిని, అంకిత, జాన్సన్, అభినరు, ప్రసాద్, ఆనంద్, సాయిచరణ్, తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడ : మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఆవరణలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ జాతీయ అధ్యక్షుడు దాట నాగేశ్వర్రావు అధ్యక్షతన పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లెల రాము, ఏఎస్పీ జిల్లా అధ్యక్షుడు సిద్దబోయిన భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మోకాళ్ల సుధీర్, నాయకులు కల్తీ వీరస్వామి, సందీప్, బాబురావు, సమ్మయ్య, నాగేశ్వర్రావు, సుధాకర్, లక్ష్మయ్య, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
గోవిందరావుపేట : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సూడి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ జయంతి నిర్వహించారు ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి శ్రీనివాస్‌రెడ్డి పూలమాల వేసి నివాళ్లర్పించి మాట్లాడారు కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మురహరి భిక్షపతి, ఎంపీటీసీలు వెలిశాల స్వరూప, గోపిదాసు ఏడుకొండలు, ఉమాదేవి, కోఆప్షన్ సభ్యులు బాబర్, శ్రీనివాస్, ఇక్బాల్, బొల్లం శివ, ఈర్ల అజరు, తదితరులు పాల్గొన్నారు.
వెంకటాపూర్ : తహసీల్ కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి డిప్యూటీ తహసీల్దార్ తఫజుల్ హుస్సేన్ పూలమాలలు వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజకుమారి, సీనియర్ అసిస్టెంట్ పార్థసారథి, వీఆర్వోలు గోక రమేష్, నాగరాజు, వీఆర్యేలు రమేష్, భాస్కర్, సిబ్బంది చందు, తదితరులు పాల్గొన్నారు.
మంగపేట : తహసీల్ కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్ పూలమాలలు వేసి నివాళ్లర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్ఐ పున్నం కామేశ్వరరావు, మండల స్టాటిస్టికల్ అధికారి శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ విక్రం, సర్వేయర్ సుష్మ, వీఆర్వోలు మాదరి నారాయణ, జాకీర్ హుస్సేన్, రిజ్వానా, క్రాంతి, ధరణి ఈశ్వర్, చెట్టుపల్లి భిక్షపతి, కొంరయ్య, తదితరులు పాల్గొన్నారు.