Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల నిఘా పెంపు
- సరిహద్దుల్లో కూంబింగ్
నవతెలంగాణ-వరంగల్
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్, సుకుమా జిల్లాల సరి హద్దుల్లో శనివారం జరిగిన ఘటనతో ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల ఉనికే లేదని పోలీసు అధికా రులు భావిస్తున్న తరుణంలో సరిహద్దు రాష్ట్రం లో చోటు చేసుకున్న ఈ ఘటనలో 22 మంది జవాన్లు మృతి చెందడం పోలీసు శాఖలో కల వరం సృష్టించింది. ఈ ఘటన అనంతరం అప్రమత్తమైన ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీ సులు ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు జిల్లా లతో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. కోబ్రా బెటాలి యన్, డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ల వంటి పటిష్ట బలగాలపైన అండర్ బారెల్ గ్రేనైడ్ లాంచర్లతో దాడి చేయడం పోలీసు వర్గాల్లో కలవరం సృష్టిస్తోంది. హిడ్మా నేతృత్వంలో జరిగిన ఘటనగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి ఈ దాడికి మావోయిస్టులు తెగబడ్డారని సీనియర్ పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో మావోయిస్టులు భూపాలపల్లి, ములుగు జిల్లాల అటవీ ప్రాంతం లోకి చొరబడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటన సమయంలోన వరంగల్ పోలీస్ కమిషనర్‌గా తరుణ్ జోషిని నియమించడం ఆసక్తికరంగా మారింది. గతం లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తరుణ్ జోషి అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)గా పని చేశారు. ఇప్పటివరకు వరంగల్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్ ఇన్‌ఛార్జి వరంగల్ పోలీస్ కమిషనర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ సంఘటన నేపథ్యంలోనే ఈ నియామకం జరిగిందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘటన పోలీసు వర్గాల్లో కలవరం సృష్టిస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం తో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు సరిహద్దుగా ఉంది. ఈ క్రమంలో ఈ ఘటన అనంతరం మావోయిస్టులు ఈ జిల్లాల్లోకి ప్రవేశించకుండా పటిష్టమైన కూంబింగ్ చర్యలు ప్రారంభించారు. గోదావరి పరివాహక ప్రాంతం వెంట ఈ రెండు జిల్లాలకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సరిహద్దుగా ఉంది. ఛత్తీస్‌ఘడ్ ఘటన నేపథ్యంలో వరంగల్ పోలీ సు కమిషనర్‌గా తరుణ్ జోషిని రాష్ట్ర ప్రభుత్వం నియమించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో తరుణ్ జోషి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)గా పని చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్నేండ్లుగా మావోయిస్టుల ఉనికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో లేదని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఛత్తీస్ గఢ్‌లో మావోయిస్టులు కొట్టిన దెబ్బకు 22 మంది జవాన్లు మృతి చెందడంతో పోలీసు శాఖ కలవరపాటుకు గురైంది. ఇంత భారీ ఎత్తున జవాన్లు మృత్యువాత పడ్డ సంఘటన ఇటీవల ఎన్నడూ లేదు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా సైతం నివ్వెరపోయింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి తరుచూ భూపాలపల్లి, ములుగు జిల్లాల అటవీ ప్రాంతానికి మావోయిస్టులు వచ్చి పోతుంటారని ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో సరిహద్దు అటవీ గ్రామాల్లో కూంబింగ్‌ను పోలీసు అధికారులు ముమ్మరం చేశారు.
పక్కా స్కెచ్‌తో..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజాపూర్, సుకుమా జిల్లాల సరిహద్దు ప్రాంతం తెర్రం పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం మావోయిస్టులు టాక్టికల్ కౌంటర్ ఆఫెన్సివ్ క్యాంపెయిన్ (టీసీఓసీ) చేస్తు న్నట్లు సమాచారం రావడంతో కోబ్రా, సీఆర్పీఎఫ్, తదితర పోలీసు దళాలు రంగంలోకి దిగాయి. వీరి రాకను ముందే పసిగట్టిన మావోయిస్టులు ఎత్తైన ప్రాంతం నుంచి లైట్ మెషిన్ గన్స్, అండర్ బ్యారెల్ గ్రెనైడ్ లాంచర్లతో కాల్పులు జరపడంతో జవాన్లు భారీ సంఖ్యలో మృత్యువాత పడ్డారు. సుమారు 5 గంటలపాటు జరిగిన కాల్పుల్లో పోలీసు శాఖ తీవ్రంగా నష్టపోయింది. 22 మంది జవాన్లు మృతి చెందడమే కాకుండా సీఆర్పీ ఎఫ్ జవాన్‌ను మావోయిస్టులు బందీగా చేసుకున్నారు. సుమారు 30 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మావోయిస్టులు ఎందరు చనిపోయారో తెలియాల్సి ఉంది.
చర్చనీయాంశంగా మారిన మావోయిస్టుల దాడి
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల దాడిలో 22 మంది జవాన్లు మృతిచెందడం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ దాడిలో మావోయిస్టులు రాకెట్ లాంచర్లు, ఇన్సాట్, ఏకే-47లతో జవాన్లపై దాడి చేసినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టులు కొంత కాలంలో పలు జాతీయ సమస్యలపై మావోయిస్టు పార్టీ మీడియాకు ప్రకటనలు విడుదల చేయడం చర్చకు దారి తీసింది. ఇదే క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘటన పోలీసు వర్గాల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఘటన నేపథ్యంలో ప్రతికార దాడులకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బలగాలు ప్రయత్నించే అవకాశం లేకపోలేదు.