Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్ని ప్రమాద బాధితులకు చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-ములుగు
మండలంలోని బొగ్గులవాగుపై చెక్‌డ్యామ్ నిర్మించి ఆ ప్రాంత గిరిజన గ్రామాల రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని కోరారు. కలెక్టరేట్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ సమక్షంలో మంగళవారం జరిగిన డీఎల్సీ సమావేశానికి సీతక్క హాజరై మాట్లాడారు. వర్షాలు కురిస్తే బొగ్గుల వాగు నుంచి వచ్చే వరద నీటితో లక్నవరం సరస్సు నిండుతుందని, ఈ చెరువు ముందు 7 గిరిజన గ్రామాలకు యాసింగి పంట పండదని, వర్షాకాలం లక్నవరం సరస్సు ముందున్న పొలాలు నీట మునుగుతాయని చెప్పారు. బొగ్గుల వాగులో చెక్కడ్యామ్లు ఉంటే 3 వేల ఎకరాలకు అదనంగా నీరు అందుతుందని సీతక్క మంత్రుల, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా పాకాల చెరువు నింపి పక్కనే ఉన్న కొత్తగూడ, గంగారాం మండలాలకు సాగునీరు అందించాలని, వెంకటాపూర్ మండలంలోని ఇంచెన్ చెరువులో లిఫ్ట్ ఏర్పాటు చేయాలన్నారు.
అగ్ని ప్రమాద బాధితులకు చెక్కులు
తాడ్వాయి మండలంలోని లింగాలలో ఇటీవలే ప్రమాదవశాత్తు 4 ఇండ్లు దగ్ధం కాగా బాధిత కుటుంబాలకు ఐటీడీఏ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు చొప్పున చెక్కులు ఎమ్మెల్యే సీతక్క అందజేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ హనుమంతు కె జెండగే, డీటీడీఓ మంకిడి ఎర్రయ్య, తదితరులు పాల్గొన్నారు.