Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినియోగ దారుల ఫోరం జిల్లా అధ్యక్షులు వెంకటేష్
నవతెలంగాణ-భూపాలపల్లి
వినియోగదారుల హక్కుల పరిరక్షణకై పోరాడాలని వినియోగదారుల ఫోరం జిల్లా అధ్యక్షులు కుడుదుల వెంకటేష్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వినియోగదారుల ఫోరం కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు చేతుల మీదుగా. మంగ ళవారం వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 నూతన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక డిజిటల్ యుగంలో వినియోగదారులు అనేక రూపాల్లో మోసాల గురవుతున్నారని తెలిపారు. ఉత్పత్తిదారుడు. అమ్మకపు దారుడు ఎక్కడా కనిపి ంచని ఆన్లైన్ యుగంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 2019 ఇది కొనుగోలుదారులకు పెద్ద ఆసరా ఆయుధమని చెప్పక తప్పదన్నారు. వినియో గదారులుగా తమ హక్కుల పరిరక్షణకై పోరాడాలి 31 డిసెంబర్ 2019 చట్టం అమల్లోకి వచ్చిందని వారెంట్లు సమస్య స్థానిక పోలీస్ స్టేషన్లు కోర్టుల సహాయంతో పరిష్కారం చేసుకోవచ్చన్నారు. గత చట్టాలతో పోలిస్తే 2019 వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం అనేక విధాలుగా విశిష్టమై నదని ఈ నూతన చట్టం పలు విధాలుగా వినియోగదారులకు రక్షణ కవచంగా ఉంటుందని వినియోగదారుల కోసం అనేక రక్షణలు కొత్త చట్టంలో రూపొందిం చబడిందన్నారు. కార్యక్రమంలో దాసరి తామస్, ఇన్ కేబుల్ సత్యనారాయణ, చిప్ప ఉమాదేవి, గడ్డం సజన, మేడి పెళ్లి పూర్ణచందర్, చాప రాజు, రమేష్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.