Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూరు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎంపీటీసీల ఫోరం ప్రతినిధులు హైదరాబాద్‌లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ రూ. 500 కోట్లు కేటయించడాన్ని స్వాగతిస్తూ మరిన్ని నిధులు ప్రతి సంవత్సరం కేటాయించాలని, అదేవిధంగా ఎంపీటీసీలకు మండలంలోని ఈజీఎస్ వర్క్‌లను మానిటర్ చేసే బాధ్యతలుకల్పించాలని ఎంపీటీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఎమ్మెల్సీ కవితను కోరారు. అదే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా ఎంపీటీసీలను అందులో భాగస్వాములను చేస్తూ ఉత్వర్వులు జారీ చేయాలని ఇచ్చిన రూ. 500 కోట్లలో పనులను గుర్తించే బాధ్యత ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచా యతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణరెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్య క్షుడు వేం వాసుదేవరెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు కమలాపురం రమేష్, గుడెప్పాడు ఎంపీటీసీ బీరం రజనీకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.