Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
నగర పరిధిలో పెరుగుతున్న భూకబ్జాదారులపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. అమాయక ప్రజలను మోసం చేస్తూ నకిలీ పత్రాలు సృష్టించి పైడిపల్లి శివారులో కబ్జాలకు పాల్పడుతున్న ఓ రౌడీ షీటర్, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మరో ఇద్దరిపై హసన్‌పర్తి పోలీ సులు కేసు నమోదు చేసారు. వివరాల్లోకి వెళితే ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు కథనం ప్రకారం హసన్‌పర్తి పోలీసు స్టేషన్ ఫరిధి పైడిపల్లిలో ఇదే గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి జంగ కొము రయ్య, గోనె రవీందర్ సర్వే నెం.1247లోని ప్లాట్ నెంబర్ 74, జనగామ జిల్లా అంబేద్కర్ నగర్‌కు చెందిన కందిమల్ల జ్యోతికి చెందిన సర్వే నెం.1247లోని ప్లాట్ నెం.75, బొల్లం రాజేంద్రంకు చెందిన సర్వే నెం.1247 ప్లాట్ నెం.78లో గల భూమిని అన్ని డాక్యుమెంట్ల కలిగి భూమిని కొనుగోలు చేసారు. ఈ క్రమం లోనే ఆ ముగ్గురికి చెందిన భూమిలో పైడిపల్లికి చెందిన రౌడీ షీటర్ రావిరాకుల బాబుతో కలిసి వరంగల్ కాశిబుగ్గకు చెందిన ఎన్పీడీసీఎల్ ఎస్ఈ కేలోతు రాజు చౌహాన్, మహ బూబాబాద్ జిల్లాకు చెందిన ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ గోపరాజు తిరుపతి, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం లక్కాకు వెంకట్, దామెర మండలం ల్యాదెల్ల గ్రామానికి చెందిన రాచమల్ల భిక్షపతిలు కలిసి నకిలీ పత్రాలు సృష్టించి భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆధారాలతో నిరూపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు దర్యాప్తు చేశారు. బాధితులు ఇచ్చిన ఆధారాలను పరిశీలించి నకిలీ పత్రాలు సృష్టించి భూకబ్జాలకు పాల్పడుతున్న ఎన్పీడీసీఎల్ ఎస్ఈ కేలోతు రాజుచౌహాన్, ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ గోపరాజు తిరుపతి, రౌడీషీటర్ రావిరాకుల బాబు, లక్కాకు వెంకట్, రాచమల్ల భిక్షపతిలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.