Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామంలో 25 పాజిటివ్ కేసులు నమోదు
- వాడ వాడలో శానిటైజేషన్
- భయాందోళనలో ప్రజలు
నవతెలంగాణ-కాజిపేట
కడిపికొండ గ్రామస్తులను కర్నోఆ ప్రస్తుతం భయపెట్టేస్తుంది. గ్రేటర్ 35వ డివిజన్ పరిధిలోని కడిపికొండలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగు తూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందగా అంతిమయాత్రలో కరోనా వైరస్ సోకిన వ్యక్తి పాల్గొనడంతో అంతిమ యాత్రలో పాల్గొన్న వ్యక్తులకు కరోనా సోకింది. దీంతో కరోనా కేసులను తగ్గించాలని గ్రామ కుల సంఘాలు పెద్దలు పార్టీల కతీతంగా గ్రామంలో కరోనా ను అరికట్టడానికి ఒక నిర్ణయానికి వచ్చి వారం రోజుల పాటు లాక్డౌన్ విధించారు. శానిటేషన్ సిబ్బంది ప్రతిరోజు వాడ వాడలో శానిటేషన్ చేస్తున్నారు. గ్రామంలో సుమారు 25కి పైగా కేసులున్నాయని ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు.
స్వచ్ఛందంగా మొదటిరోజు లాక్ డౌన్
గ్రామంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగు తుండడంతో గ్రామస్తులు వారం రోజుల పాటు లాక్డౌన్ విధించగా ప్రజలందరూ స్వచ్ఛందంగా కరోనా నిబంధనలు పాటిస్తూ ఇండ్లకే పరిమి తమయ్యారు. ఉదయం 10 గంటల లోపు మాత్రమే నిత్యావసర వస్తువుల కొరకు దుకాణాలు తెరుచుకోగానే ప్రజల సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి అవసరాల నిమిత్తం బయటికి వచ్చారు. అనంతరం పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ప్రారంభమై రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
కరోనా బాధితులను గుర్తించి చికిత్స అందిస్తున్నాం
- వైద్యాధికారి శైలజ రెడ్డి
గ్రామంలో దాదాపు నలభై కరోనా బాధితులున్నారు. వారిని గుర్తించి చికిత్స అందిస్తూ హోం క్వారెంటైన్ చేస్తున్నాం. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులకు అనుమానం ఉన్న వ్యక్తులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. అన్ని విధాలా వైద్య సేవలు అందు బాటులో ఉంచాం. గ్రామంలో వందలాది కరోనా కేసులు ఉన్నాయని ప్రజలు భయబ్రాంతులకు గురవు తున్నారు. అది అవాస్తవం. గ్రామంలో దాదాపు 25 కరోనా కేసులు మాత్రమే ఉన్నాయి. ప్రజలు గ్రామ కమిటీ నియమించిన లాక్ డౌన్ నియమ నిబంధనలు పాటించి వారం రోజుల పాటు ఇండ్లకే పరిమితం కావాలి. భైతిక దూరం పాటించి మాస్కులు తప్పని సరిగా ధరించాలి.