Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించినట్టు మున్సిపల్ చైర్మెన్ ఎస్ వెంకట రాణి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇల్లంద క్లబ్ హౌస్ లో మంగళవారం మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ శ్రీనివాస్ మున్సిపల్, వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం సుదీర్ఘమైన చర్చ జరిగి 52 కోట్ల 19 లక్షల 80 వేల బడ్జెట్ ఆమోదం పొందింది. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినట్టు తెలిపారు. భూపాలపల్లి పట్టణం ఒకప్పుడు కుగ్రామంగా ఉండి నేడు సింగరేణి, వాణిజ్య వ్యాపార సంస్థ లతో ఉందన్నారు. ప్రజల సౌకర్యార్థం పట్టణ కేంద్రంలో ఇప్పటి వరకే సీసీ రోడ్లు తాగునీటి వసతి మార్కెట్ యాడ్లు పలు సమస్యలు పరిష్కరించినట్టు తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని ఇంకా అభివద్ధికి పనులను ప్రారంభిం చనున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా కౌన్సిలర్లు సహకరించాలని తెలిపారు.
సంతపై చింత:టెండర్ రద్దు చేయాలని కౌన్సిలర్ల డిమాండ్
జిల్లా కేంద్రంలో ప్రతి గురువారం కొనసాగుతున్న సంతపై వచ్చిన డబ్బులపై బడ్జెట్ సమావేశంలో చింత మొదలైంది. టెండర్లు దక్కించుకున్న అభ్యర్థులు మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బులు చెల్లించలేదని అధికారులు సమా వేశంలో చెప్పడంతో కౌన్సిలర్లు తీవ్రంగా మండిపడ్డారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కేంద్రంతో పాటు జంగేడులో రెండు వేర్వేరు కొనసా గుతున్నాయి. భూపాలపల్లి వారాంతపు సంత నాలుగు లక్షల 30 వేలకు టెండర్ దక్కించుకున్న సదరు వ్యక్తి లక్షా యాభై వేలు మాత్రమే చెల్లించి మిగతావి మున్సిపాలిటీ చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడని ఇదే క్రమంలో జంగేడు సంత దక్కించుకున్న వ్యక్తి 67 వేలకు 50 వేలు మాత్రమే చెల్లించి మిగతా డబ్బులు ఇవ్వడం లేదని, పట్టణంలోని గంప చిట్టీకి రెండు లక్షల ఇరవై వేలకు దక్కించుకున్న సదరు వ్యక్తి లక్షా యాభై వేలు మాత్రమే చెల్లించి మిగతా డబ్బులు చెల్లించడం లేదని సమావేశంలో అధికారులు చెప్ప డంతో కౌన్సి లర్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న సమంత సుమారు ఒక రోజు లక్షా యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు సదరు కాంట్రాక్టర్ వ్యాపారస్తుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నాడని మున్సిపాలిటీకి చెల్లించాల్సిన డబ్బులు నిర్లక్ష్యం పై అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని కౌన్సిలర్ మేకల రజిత రవీందర్, తిరుప అనిల్, తదితరులు ఘాటుగా ప్రశ్నిం చారు. దీంతో కొంత గందరగోళం నెలకొంది, వారిపై చర్యలు తీసుకోవాలని వాళ్ల టెండర్ రద్దు చేయాలని అధికారులను హెచ్చరించారు.
ఫైన్లు వేసిన డబ్బుల వివరాలేవీ?
అధికారులపై కౌన్సిలర్ల ప్రశ్నల వర్షం
జిల్లా కేంద్రంలో పలు రెస్టారెంట్లు ,షాపులు పై 500 నుంచి 5000 వరకు ఫైన్లు వేశారని కానీ వాటి లెక్క చెప్పడం లేదని కౌన్సిలర్లు అధికారులను ప్రశ్నించారు. పర్మిషన్ లేకుండా హలో బిల్డింగులు నిర్మిస్తున్నారని వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులపై కౌన్సిలర్లు ప్రశ్నల వర్షం కురి పించారు. పెద్దోడికి ఒక న్యాయం పేదోడికి ఒక న్యాయంగా అధికారులు వ్యవహ రించడం సరైంది కాదన్నారు. బానోతు వాడ కష్ణ కాలేజీలలో గత ఇరవై రోజుల క్రితం ఇంటి పనులు కట్టలేదని సోఫాలు, దర్వాజలు స్వాధీనపరుచుకున్న మున్సిపల్ అధికారులు ఇక్కడ ఉన్న సింగరేణి కార్యాలయం 32 కోట్ల 18 లక్షలు, తహసీల్దార్ కార్యాలయం నాలుగు లక్షల 18,000, ఆర్డిఓ కార్యాలయం5, లక్షల 71, 000 అగ్రికల్చర్ కార్యాలయం లక్షా ఇరవై ఎనిమిది వేలు ఆర్టీసీ బస్ డిపో ఐదు లక్షల ఎనభై వేలు ఇలా లక్షల్లో ఇంటి పన్ను బకాయి ఉంటే మరి మనమేం చేస్తున్నామని అధికారుల తీరుపై కౌన్సిలర్లు మండిపడ్డారు.
అధికార ప్రతిపక్ష కౌన్సిలర్ల మాటల యుద్ధం
బడ్జెట్ సమావేశంలో అధికార పార్టీ మరియు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్ల మధ్య స్వల్పంగా మాటల యుద్ధం మొదలైంది. గత నెల 30 వ తేదీన బడ్జెట్ సమావేశం జరగాల్సి ఉండగా అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో ఏఐఎఫ్బీ కౌన్సిలర్ మాత్రం హాజరై అధికారపార్టీ కౌన్సిలర్లు ఈ సమావేశానికి హాజరు కాకపోవడం పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆ సమావేశంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు మా పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మెన్ హరిబాబు జోక్యం చేసుకొని పార్టీల కతీతంగా సమిష్టిగా పని చేసి పట్టణ అభివద్ధికి కషి చేయాలని విభేదాలు లేకుండా అభివద్ధిలో భాగస్వాములు కావాలని సూచించడంతో గొడవ సద్దుమణిగింది తర్వాత సమా వేశం కొనసాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు హరీష్ రెడ్డి, అనిల్, రవీందర్, రాజు, సంపత్ సమ్మయ్య, హారిక, మౌనిక, కమలమ్మ ,రజిత, పూలమ్మ ,రేణుక, శిరీష ,శ్రీనివాస్ సరోజన, రజిత తదితరులు పాల్గొన్నారు.