Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపట్లోగా పాకాలకు
- రెండో పంటకు ఢోకా లేదు: ఎమ్మెల్యే పెద్ది
నవతెలంగాణ-నర్సంపేట
పాకాలకు గోదావరి జలాలు చేరుకోవాలనే రైతుల చిరకాల స్వప్నం నెర వేరబోతుంది. రంగయ్య చెరువు, పాకాలకు గోదావరి జలాలు తీసుకరావాలనే ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంకల్పం ఆచరణకు దగ్గర్లో ఉంది. మంగళవారం దేవాదుల క్యాకేజ్-2 ద్వారా భీంఘణపురం నుంచి రామప్ప రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, సాగునీటి పారుదల ఇంజనీరింగ్ అధికారుల బృందం రామప్ప అవుట్ పాల్ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. రేపట్లోగా పాకాల సరస్సుకు గోదావరి జలాలు చేరుకొ ంటాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. పాకాల రైతుల వంద యేండ్ల కల సాకారం కాబోతుందని సంతృప్తి వ్యక్తం చేశారు. యాసంగి పంటకు ఇక ఢోకా లేదని గోదావరి జలాలు పంట పొలాలను ముద్దాడనుందని తెలిపారు. మరో వైపు గోదావరి-కృష్ణ నదులు కూడా అనుసంధానం అయ్యే మహ త్తరమైన సమయం ఆసన్నం కానుందని తెలిపారు. ఈ అపర భగీరథ ప్రయత్నాన్ని ఆవిష్కృతం చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి రైతులు హర్షం వెలుబుచ్చుతూ కృతజ్ఞతలు తెలిపారు.