Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ యేడాదికో రెండు కోట్ల ఉద్యోగాలు..రాష్ట్రంలోని కేసీఆర్ ఇంటికో ఉద్యోగం హామీలు భూటకమని తేలిందని డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు భారపాక సతీష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్య దర్శి దిడ్డి పార్థసారథి, ఏఎల్వైఎఫ్ జిల్లా కార్యదర్శి ఐతే యాకూబ్ అన్నారు. ఎస్ఎఫ్ఐ కార్యాలయలో విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల, ప్రయివేటు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను కారుచౌకగా ప్రయి వేటు బడా పెట్టుబడుదారులకు అప్పనంగా కట్టబెడుతుందన్నారు. యేడాదికో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ముందు హామీనిచ్చి నిరుద్యోగుల్లో ఆశలు కలిగించారని యేడేండ్లలో ఉద్యోగాలు ఏమో గాని ప్రభుత్వ రంగ స్థలను ప్రయివేటు పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడకొట్టే చర్యలకు పూనుకుందని విమర్శించారు. రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిందన్నారు. నియమాకాల పేరుతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లను జారీ చేయకుండా యువతను మోసగించిందన్నారు. ఈ రెండు పాలక ప్రభుత్వాల విధానాల వల్ల నిరుద్యోగ యువత దిగ్గుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక శాఖల్లో ఖాళీలు ఉన్నా వాటిని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లను విడుదల చేయకపోవడం బాధా కరమాన్నారు. కరోనా నేపధ్యంలో 15 నెలలగా విద్యా సంస్థలు మూతపడి విద్యార్థులు చదువులకు దూరం కావాల్సిన పరిస్థితులు పాలకులు తీసుకొచ్చారని తెలిపారు. లాక్డౌన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రయివేటు విద్యా రంగాల్లో బోధనలను అందిస్తున్న రెండు లక్షల మంది ఉపా ధ్యాయులు వేతనాలు లేక సతమతమౌతూ కుటుంబాన్ని పోషించలేని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ స్టేజ్-2 పేరుతో ఏకంగా విద్యాలయాలు మూసివేయడం సరైందికాదన్నారు. బార్లు, బ్రాండీ షాపులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాళ్లలలో రాని కరోనా కేవలం విద్యాల యాలలో ద్వారానే వాప్తి చెందుతుందని ప్రభుత్వం చెప్పడం ఎంతవరకు సమంజ సమని ప్రశ్నించారు. ఇదిలాగనే కొనసాగితే విద్యార్థుల భవిష్యత్ అందకారంగా మారు తుందన్నారు. వెంటనే ప్రభుత్వం కరోనా నియమాలు కఠినతరం చేస్తూ విద్యా సంస్థలు తిరిగి తెరిపించాలన్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువత, ఉపాధ్యాయలు తీవ్రమైనా పోరాటాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.