Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
ప్రణాళికబద్ధంగా దాన్యం కొనుగోలు ప్రక్రియ చేప ట్టాలని రాబోయే యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోల పై ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మంది రంలో వరి ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే యాసంగి సీజన్లో లో 2 లక్షల 13 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి జిల్లాలో అంచనా వేసినట్టు తెలిపారు. దీనికిగాను దిగుబడి ప్రకారంగా ఏప్రిల్ రెండో వారం నుంచి 105 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లు చేసి రైతులకు అందు బాటులో ఉంచాలన్నారు. ప్రతి సెంటర్కు ఒక ప్రభుత్వ ఉద్యోగిని కేటాయించాలని, కొనుగోలు కేంద్రంలో ప్యాడి క్లినర్లు, గన్ని బ్యాగులు, తేమ పరీక్షించే యంత్రాలు అవస రమగు ఇతర అన్ని రకములైన పరికరములను మరమ్మ తులు చేయించి సిద్ధంగా ఉంచాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ శానిటైజర్లు, మాస్కులు, సబ్బుతో చేతులు కడుక్కోవటానికి నీటిని టాయిలెట్స్ అందుబాటులో ఉంచాలని సూచించారు. 10వ తేదీలోగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి రైతులు తాలు లేకుండా తేవాలని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి సెంటర్లలో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని గతంలో జరిగిన పొరపాట్లు, ఇబ్బందులు రాకుండా చూడా లని, రైస్ మిల్లులలో స్టోరేజి సమస్యలు లేకుం డా చూడా లని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యా రాణి, జేడీ ఉషాదయల్, డీసీఓ నాగేశ్వరరావు, డీసీఎస్ఓ వసంతలక్ష్మి, డిఎమ్ సీఎస్ కష్ణవేణి, డీఎంఅండ్హెచ్ఓ లలితాదేవి, డిపిఓ జగదీష్, మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు, ట్రాన్స్ పోర్టేషన్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.