Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ( ఎస్సీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు
నవతెలంగాణ-కోల్బెల్ట్
కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను కుదించి నాలుగు కోడ్ లుగా మార్చడాన్ని విరమించుకోవాలని నిరసిస్తూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహ రావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త ఆందో ళనలో భాగంగా భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని కేటీకే5 గనిలో కోడ్ ప్రతులను నరసింహారావు, రాజయ్యల ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక చట్టాలను నిర్వీ ర్యం చేసి కార్మికుల హక్కులను మోడీ ప్రభుత్వం హరించడమే లక్ష్యంగా పెట్టుకుందని మండి పడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు ధారా దత్తం చేసి ఉద్యోగులను కీలుబొమ్మలుగా చేసి ఆడించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కార్మిక ఉద్యోగ భద్రత లేకుండా, హక్కుల కోసం సమ్మె చేసే పరిస్థితి ఉండదని, యాజమాన్యానికి కట్టుబానిసగా మారే పరిస్థితి ఉంటుం దని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులంతా ఐకమత్యంగా ప్రభుత్వ విధానానికి బుద్ధి చెప్పాలని, కార్మిక లోకానికి అండగా సీఐటీయూ ఎల్లవేళలా పోరాటం చేస్తుందన్నారు.