Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
పేదింటి ఆడపడుచులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడిందని మహబూబాబాద్ జెడ్పీ చైర్పర్సన్ బిందు నాయక్ తెలిపారు. మండల కేంద్రంలో తహసీల్దార్ నాగ భవానీ ఆధ్వర్యంలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా బిందు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 87 మందికి చెక్కులు అందించిందని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కారానికి కషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ చేపూరి మౌనిక, సర్పంచ్ ధనసరి కోటమ్మ, ఎంపీటీసీ తిరుమల శైలజ ప్రభాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్ కవిత సంపత్, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు సోమిరెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రాసమళ్ల నాగేశ్వర్రావు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీడీఓ, టీఆర్ఎస్ నాయకులు అంగోత్ శ్రీకాంత్ నాయక్, సంకు సత్తిరెడ్డి, వెంకటపతి, బొబ్బిలి కిరణ్, జర్పుల శ్రీనివాస్, పోతుగంటి సుమన్, పగడాల శ్రీనివాస్, ఏనుగుల రాకేష్, తొట్టి కృష్ణ, చెరుకుపల్లి రవి, దేవుజ, తదితరులు పాల్గొన్నారు.