Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల శేఖర్ కోరారు. మండల కేంద్రంలో జిల్లా స్టాండింగ్ కమిటీ చైర్మెన్ మారపాక రవి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధికార ప్రతినిధి తాటికొండ సురేష్ చేతుల మీదుగా పూలే, అంబేద్కర్ సందేశ్ యాత్రలో భాగంగా కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడారు. మహనీయుల ఆశయ సాధన కోసం కషి చేయాలన్నారు. ప్రభుత్వ రంగాలను ప్రయివేటుపరం చేస్తూ దళితులకు, గిరిజనులకు, బడుగులకు రిజర్వేషన్లు లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఈనెల 12న తలపెట్టిన సందేశ్ యాత్రను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, మత్స్యకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మునిగెల రమేష్, మండల అధ్యక్షుడు చిలుముల్ల భాస్కర్, కార్యదర్శి మంద మహేందర్, నాయకులు దైద సుభాష్, మాతంగి దేవయ్య, చింత భరత్ కుమార్, ఊరడి లింగం, తదితరులు పాల్గొన్నారు.