Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-ములుగు
జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి అధ్యక్షతన మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క 9 మండలాల ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈనెల 15 నాటికి గ్రామ, మండల,జిల్లా స్థాయిలో పార్టీ, అనుబంధ కమిటీలను పూర్తి చేయాలన్నారు. కొత్తగూడ, గంగారాం మండలాలకు నల్లెల కుమారస్వామి, వెంకటాపూర్‌కు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, బొక్క సత్తిరెడ్డి, ముశినపెల్లి కుమార్ గౌడ్, గోవిందరావుపేటకు బైరెడ్డి భగవాన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కూనూరు అశోక్ గౌడ్, మంగపేటకు ఇర్లవడ్ల వెంకన్న, నామా కరంచంద్ గాంధీ, తాడ్వాయి మండలానికి గుమ్మడి సోమయ్య, పులి సంపత్ గౌడ్, ఏటూరునాగారం మండలానికి పన్నాల ఎల్లారెడ్డి, దాసరి సుధాకర్, కన్నాయిగూడెం మండలానికి అయుబ్ ఖాన్, వావిలాల చిన్న ఎల్లయ్య, గుడ్ల దేవేందర్‌ను ప్రకటించారు. అలాగే జిల్లా యూత్ కమిటీ ఇన్ఛార్జిగా బానోత్ రవిచందర్‌ను నియమించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చాంద్ పాషా, చెన్నోజు సూర్యనారాయణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టెవాడ తిరుపతి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ గణేష్, ఆత్మ డైరెక్టర్ ఆకుతోట చంద్రమౌళి, సహకార సంఘం వైస్ చైర్మెన్ మర్రి రాజు, సర్పంచ్‌లు గండి కుమార్ కల్పన, మాడ ప్రకాష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మైస ప్రభాకర్, అర్షం రఘు, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.