Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
మండలంలోని అమ్మాపురం గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని సీఐ కరుణాకర్ తెలిపారు. గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు గూడెల్లి సైదులు అతడి తల్లిదండ్రులు రాములు-లక్ష్మీ జ్ఞాపకార్ధం బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం సీఐ కరుణాకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. వేసవి నేపథ్యంలో బాటసారులు తాగునీటి కోసం ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. బాటసారుల దాహార్తిని తీర్చేలా వార్డు సభ్యుడు చలివేంద్రం ఏర్పాటు చేసి స్ఫూర్తినిచ్చారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కడెం యాకయ్య, ఉపసర్పంచ్ ముద్దం వీరారెడ్డి, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు డోనుక ఉప్పలయ్య, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ముద్దం విక్రమ్‌రెడ్డి, వార్డ్ సభ్యులు గద్దల శ్రీకాంత్, తమ్మెర వీరభద్రరావు, తమ్మెర విశ్వేశ్వర్రావు, తీగల మహబూబ్‌రెడ్డి, షాట్ అధ్యక్షుడు తీగల కష్ణారెడ్డి, మిమిక్రీ ఆర్టిస్ట్ గట్టు నవీన్‌కుమార్, తీగల ఉపేందర్‌రెడ్డి, డోనుక సైదులు, డోనుక ఐలయ్య, యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.