Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో పీహెచ్సీ ఎదుట ధర్నా
నవతెలంగాణ-గార్ల
ఆశావర్కర్లకు శ్రమకు తగ్గ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ మండల కన్వీ నర్ కందునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ ల సమస్యలను పరిష్క రించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అధ్వ ర్యంలో ముల్కనూరు పీహెచ్సీ ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. ఆన్లైన్ సాకుతో పారితోషికం తగ్గిం చడం సరికాదన్నారు. ఆశవర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, కరోనా సమయం లో ఇచ్చిన హమీలను నేరవేర్చాలని, రక్షణ పరికరాలు అందించాలని, భీమా సౌకర్యం కల్పించాలని, సెల్ఫోన్లు అందించి శిక్షణ ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం వైద్యాధికారి ప్రణవికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ఆశావర్కర్ల సంఘం నాయకులు పందుల రమ, రమణ, పుష్ప, సుజాత, నాగమణి, నిరోషా, గిరిజన సంఘం నాయకులు భూక్య హరినాయక్, మాళోత్ శాంతికుమార్, తదితరులు పాల్గొన్నారు.