Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్‌రెడ్డి
- బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని లింగాల గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం వల్ల ఇండ్లు కాలిపోయి భారీగా నష్టపోయిన వారికి ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్‌రెడ్డి కోరారు. బాధిత కుటుంబాలకు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్ ఊకె మౌనిక నాగేశ్వర్రావు, మాజీ సర్పంచ్ ఈక సమ్మక్క అధ్యక్షతన మంగళవారం బియ్యం, పప్పు, కూరగాయలు, బట్టలు, ఇతర నిత్యావసర సరు కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడారు. అగ్ని ప్రమా దం వల్ల నష్టపోయిన చాపల పెంటమ్మ, చాపల సుధాకర్, చాపల కాంతారావు, చాపల యాదయ్యలకు ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.2 లక్షలు చొప్పున అందించాలని చెప్పారు. బాధితులకు బట్టలు అందించిన ముమ్మడి ఉపేంద్ర చారికి, పద్మశ్రీ క్లాత్ స్టోర్ నిర్వాహకుడు గణేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందేలా చొరవ తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు పులిగుజ్జు వెంకన్న, పొదిల చిట్టిబాబు, గిరిజన సంఘం నాయకులు ఈక ప్రభాకర్, గొంది రాజేష్, గ్రామ కమిటీ కార్యదర్శి ఈక నాగేశ్వర్రావు, నాయకులు సామ చంద్రారెడ్డి, గుండు రామస్వామి, శ్రావణ్, ముమ్మడి ఉపేంద్రచారి, అంజి, తదితరులు పాల్గొన్నారు.