Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేవించారు. కోవిడ్-19పై జాగ్రత్తలు తీసుకోవాలని వారు స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటను అమ్మడంలో ఇబ్బంది పడకూడదని సీఎం కేసీఆర్ ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ధాన్యం కొనుగోలు కోసం పౌర సరఫరాల శాఖకు రూ.20 వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినట్టు తెలిపారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇరిగేషన్, కోవిడ్-19, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆర్ఓఎఫ్ఆర్లపై మంత్రులిద్దరూ సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో మంగళవారం కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. గతేడాది అనుభవాలను దష్టిలో పెట్టుకుని ఈసారి రవాణా సదుపాయాల్లో లోటు లేకుండా, గోనె సంచులు కొరవ ఉండకుండా పర్యవేక్షించాలని చెప్పారు. అలాగే గోదాముల సామర్థ్యాన్ని చూసుకోవాలని సూచించారు. రైతులు తాలు లేకుండా, తేమ శాతం 17 మించకుండా ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తాలు, తేమ పేరుతో కోత విధించకుండా మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని అధికారులకు సూచించారు. మళ్లీ కోవిడ్ విజంభిస్తోన్న క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని చివరి ఆయకట్టు వరకు సాగునీరందేలా ప్రణాళికలు అమలు జరిగేలా చూడాలన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల పనులు పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. తొలుత గట్టమ్మ దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం సమీపంలో నిర్మిస్తున్న ఎమ్మార్సీ భవణానికి భూమి పూజ చేశారు. అనంతరం సమీకత కలెక్టర్ కార్యాలయం నిర్మాణం కోసం డిగ్రీ కళాశాల పక్కన భూమిని పరిశీలించారు. అలాగే సంచార చేపల విక్రయ వాహానాలను, హార్వెస్టర్‌ను, అన్నపూర్ణ క్యాంటీన్ ప్రారంభించారు. డ్వాక్రా మహిళా సంఘాలకు పసుపు ఉత్పత్తి, వాణిజ్యం కోసం రూ.6 లక్షల చెక్కులు, స్త్రీనిధి చెక్కులు అందజేశారు. చందా బాబు సంపాదకత్వం వహించిన వితంతు మహిళల కవిత్వం 'చెమట నది' పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు సీతక్క, వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీఓ హనుమంతు కె జెండాగే, భూపాలపల్లి జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, ములుగు అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఇన్‌ఛార్జి ఎస్పీ సాయి చైతన్య, ఎఫ్డీఓ నిఖిల, డీసీసీబీ చైర్మెన్ మార్నినేని రవీందర్రావు, జెడ్పీటీసీలు సకినాల భవానీ, గై రుద్రమదేవి, ఎంపీపీలు గండ్రకోట శ్రీదేవి సుధీర్, రైతుబంధు సమితి ములుగు జిల్లా అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య, తెలంగాణ సామాజిక రచయితల సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు కొండ్లే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
గూడెపు మౌనిక న్యాయం చేయాలని వినతి
గూడెపు మౌనికకు న్యాయం చేయాలని కోరుతూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా మౌనిక గోడు వెళ్లబోసుకుంది. అనంతరం తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రామ్మూర్తి మాట్లాడారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బందెల యాదలక్ష్మీ, రాష్ట్ర కార్యదర్శి గోస్కుల రాంబాబు, జిల్లా అధ్యక్షుడు రాజమల్ల సుకుమార్, కర్రి శ్యామ్‌బాబు, ముంజాల భిక్షపతి, లింగమల్ల రమాదేవి, బొడ రాములు, దినకరన్, ఓట్ల మోహన్, సాంబయ్య, గడ్డం నర్సన్న, కుమారస్వామి, నూకల రమేష్, గుంటక నాగేశ్వర్రావు, బల్లిపాటి నాగరాజు, కర్రి దినకర్, దొడ్డ రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.