Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
మతిస్థిమితం కోల్పోయి, నిరాశ్రాయులైన అనాథ అభాగ్యులను ఆదరించి అన్నం పెట్టండని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. బుధవారం మతిస్థిమితం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఓ అనాధ యువకుడిని చేరదీసి పెరిగిన క్షవరం చేపించి, స్నానం చేపించి కొత్త బట్టులు వేసి కడుపు నిండా అన్నం పెట్టి ఆమె ఆదరించారు. యువకుని గురించి సర్వర్ ఫౌండేషన్ సభ్యులు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో అతడిని చేరదీశారు. ఇతరుల ఆకలిని తీర్చడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా దొరకదని అన్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది వివిధ కారణాలతో యువకులు మతిస్థిమితం కోల్పోయి, నిరాశ్రాయులు అవుతున్నారని అన్నారు. అలాంటి వారిని ఆదరించాలన్నారు.