Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీడీఓ రవీందర్
నవతెలంగాణ-గార్ల
మండల పరిది ఖాళీ అయిన రాంపురం 1 వార్డు, రాజు తండలో 3 వ వార్డు, గార్లలోని నాలుగవ వార్డు స్థానాలకు జరగనున్న వార్డు సభ్యుల ఎన్నికల సందర్భంగా అయా పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రదర్శించడం జరిగిందని ఓటర్ల జాబితా పై అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీలు తెలపాలని ఎంపీడీఓ రవీందర్ రావు తెలిపారు. వార్డు సభ్యుల ఎన్నికల సందర్బంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయా వార్డుల పరిధిలోని ఓటర్ల జాబితాను రూపొందించామని అన్నారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు కె శ్రీనివాస్, పి రాధాకష్ణ, కె శ్రీనివాస్, జి సక్రు, యం గిరి ప్రసాద్, బి నాగేశ్వరరావు, జి లక్ష్మణ్ నాయక్, ఠాకూర్, పాష, తదితరులు పాల్గొన్నారు.