Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెరుచుకోని బడులు
- ఏడాదిగా వేతనాలు కరువు..
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
కరోనా కాటుకు విద్యావ్యవస్థ పూర్తిగా చతికిలపడింది. ప్రభుత్వ బడి పంతుళ్ల పరిస్థి తులు మెరుగ్గా ఉన్నప్పటికీ.. కరోనా కాటుతో వారి జీవితాలు ఒక్కసారిగా గుది బండలా మారాయి. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ కొలువు దక్కకపోవడంతో చాలా మంది ప్రయివేటు విద్యాసంస్థలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపుతో ప్రయివేటు పంతుళ్లు, పట్టభద్రులు ఏమి చేయాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి నెలకొంది. కరోనా మహమ్మారి కారణంగా బడులు మూతబడ్డాయి. మార్చి నుంచి నేటి వరకు తెరుచుకోలేదు. మధ్యలో ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి 25 నుంచి మార్చి 22 వరకు తెరు చుకున్నప్పటికీ నెల కాలం పూర్తికాకముందే మూతపడ్డాయి. దీంతో ప్రయి వేటు ఉపాధ్యాయుని బతుకు భారమైంది.
స్టేషన్‌ఘన్‌పూర్ మండల వ్యాప్తంగా సుమారు 17 ప్రయివేటు పాఠశాలలున్నాయి. ఇందులో సుమారు 300మంది వరకు ప్రయి వేటు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా వీరి పరిస్థితి దయనీయంగా మారింది. కష్టాలకడలిలో కొట్టు మిట్టాడుతూ యాజమాన్యాలు ఎప్పుడు ఆహ్వాని స్తాయో అని దయనీయంగా పాఠశాల వైపు ఎదురుచూపులు చూస్తున్నారు.
ఏడాదిగా ఎదురుచూపులు
ప్రయివేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపా ధ్యాయులకు ఏడాది కాలంగా వేతన కరువు ఏర్పడింది. కొంతమంది ఉపాధ్యా యులు కుటుంబ పోషణకు రోజూ వారి కూలీ పనులు చేస్తూ, మరికొంతమంది తమకున్న కొద్దిపాటి పంట పొలాల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక, కుటుంబ పోషణ భారంగా మారింది. తమను ఆదుకోవా లని పలుమార్లు ర్యాలీలు, నిరస నలు, అధికా రులకు వినతి పత్రాలు కూడా అందజేసినా ఫలి తం శూన్యం. ఇప్పటికైనా ఉపా ధ్యాయ కుటుంబాలకు భరోసా కల్పించి ఆదుకోవాలని వేడుకుం టున్నారు.
ఆర్థికసాయం అందించాలి- కలకోల రమేష్, ప్రయివేటు ఉపాధ్యాయ జిల్లా నాయకులు
ప్రయివేటు పాఠశాలలో విద్యాబోధన చేస్తూ జీవనం గడిపిన మేము 12నెలలుగా పాఠశాలలు మూతపడడంతో దిక్కుతోచని స్థితి నెలకొంది. వేరే పనులు చేద్దామనుకున్నా దొరకని పరిస్థితి. ప్రైవేటు విద్యా సంస్థలపై కరోనా తీవ్ర ప్రభావం పడింది. రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేటు ఉపాధ్యా యులను ప్రత్యేక ప్యాకేజీతో ఆదుకోవాలి. బడులు మూసిన నాటినుంచి నెలకు రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందించాలి.
ఇబ్బందులు తప్పడం లేదు- దామెర వేణు, ప్రయివేటు ఉపాధ్యాయుడు
స్కూళ్లు మూతబడడంతో జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. సంవత్స ర కాలంగా ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. పనిచేస్తేనే జీతాలు వచ్చే ఈ రోజుల్లో కరోనా మా జీవి తాలపై ప్రభావం చూపుతోంది. ఆర్థికంగా ఆదుకోవాలి.
ఉపాధ్యాయ వృత్తినే నమ్ముకున్నాం.. -అనిల్,ప్రయివేట్ ఉపాధ్యాయుడు, స్టేషన్‌ఘన్‌పూర్
కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రయివేటు ఉపాధ్యాయ వృత్తినే ఆధారంగా బతుకుతున్నాం. ఇటీవల మా భార్యకు రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పుల భారంతో సతమవు తున్నాం. పాలకులు, యాజమాన్యంతో సంబం ధం లేకుండా మమ్మల్ని ఆదుకోవాలి.
-అనిల్,ప్రయివేట్ ఉపాధ్యాయుడు, స్టేషన్‌ఘన్‌పూర్