Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెంకటాపూర్
మండల కేంద్రంలో బుధవారం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అధ్వర్యంలో నక్సల్స్ చేతిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవానులను స్మరించుకుంటూ కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యాక్ జిల్లా అధ్యక్షులు పంబిడి శ్రీధర్ రావు మాట్లాడుతూ దేశం కోసం,ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన జవానుల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మిల్కురి ఐలయ్య, సిద్దం రఘు, మామిడి శెట్టి కోటి, ములుగు లయన్స్ క్లబ్ ప్రతినిధి కొండి సాంబశివ, బ్రహ్మచారి, నగేష్, జంగిలి రఘు, సాదా సన్నీ, జంగిలి రాజ్ కుమార్, బూస గణేష్, మంద ఉమేష్, విజరు, అజరు, మహేష్, రఘు రాం, సాయి, మధుకర్రావు, తదితరులు పాల్గొన్నారు.