Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 తులాల బంగారం అర కిలో వెండి అపహరణ
నవతెలంగాణ-కాజిపేట
కాజిపేట మండలంలోని చైతన్యపురి వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో కిషన్ రెసిడెన్సీ అపార్ట్ మెంట్లో ఒక ఇంట్లో దొంగలు బంగారం నగదు అపహరించిన ఘటన మంగళవారం జరిగింది. బాధితుడు సింగారం శ్రీధర్, స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు చైతన్యపురి కిషన్ రెసిడెన్సీలో ఫ్లాట్ నెంబర్ 304లో నివాసం ఉంటూ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాలుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం విధి నిర్వహణలో భాగంగా అపార్ట్ మెంట్ తన ఇంటికి తాళం వేసి సతీమణితో కలిసి ఉద్యోగానికి వెళ్లారు. తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళం వేసిన గొళ్ళెం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడడంతో బీరువా తాళం పగలగొట్టి ఉంది. బీరువాలో ఉన్న 50 తులాల బంగారం అర కిలో వెండి పట్టు చీరలు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకు వెళ్లారని తెలిపారు. వాటితో పాటుగా సీసీ కెమెరాల సంబంధించిన హార్డ్ డిస్క్ కూడా దొంగతనం చేసుకొని వెళ్లారని తెలిపారు. వాటి విలువ సుమారు 30 లక్షల వరకు ఉంటుంది. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని స్థానిక సీఐ నరేందర్ పరిశీలించారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.