Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ
నవతెలంగాణ-మహదేవ్పూర్
అక్రమ దత్తత చట్టరీత్యా నేరమని జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ అన్నారు. మండలంలోని సూరారం గ్రామంలో గత నెల జన్మించిన మగ శిశువును కాళేశ్వరంకు చెందిన పిల్లలు లేని దంపతులు అక్రమంగా దత్తత తీసుకున్నారు. ఈ విషయమై జిల్లా బాలల సంరక్షణ అధికారి మహాదేవపూర్ సీడీపీఓ రాధికతో కలిసి విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఇట్టి విషయం వాస్తవమేనని, కన్న తల్లిదండ్రులకు, ఇతర గ్రామస్తులకు చట్ట బద్ధమైన దత్తతపై అవగాహన కలిగించారు. పిల్లలు లేని దంపతులు ఎవరైనా దత్తత తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రీయ దత్తత ప్రాధికార సంస్థ (కారా) వెబ్ సైట్ట్లో చట్టబద్ధమైన దత్తతకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కన్న తల్లిదండ్రులను, అక్రమంగా దత్తత తీసుకున్న దంపతులను బాబుతో సహా బాల రక్షా భవన్ కార్యాల యంలో ఉన్న బాలల సంక్షేమ సమితి ముందు ఈ శుక్రవారం హాజరు కావాలని, లేనిచో చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి ఎ.వెంకటస్వామి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.