Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
ఇటీవల కేయూ విద్యార్థి సునిల్నాయక్ ఆత్మహత్యకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించా లని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు దడిగే సందీప్ డిమాండ్ చేశారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏడేండ్ల కాలంలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం వల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతు న్నారని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయనుకున్న యువత ఆశ పడితే ఆత్మహత్యలే శరణ్యమయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగం పెరిగి భవిష్యత్తు ప్రశ్నా ర్థకంగా మారిందని అన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయకుండా, ప్రభుత్వ ఉద్యోగుల పదవి కాలాన్ని పొడగించి నిరుద్యోగులకు తీవ్ర అన్యా యాన్ని తలపెట్టిందని విమర్శించారు. ఇప్పటికైనా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు తీసు కోవాలని, ఉద్యోగుల వయోపరిమితి తగ్గించాలని, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆత్మహత్యకు పాల్పడిన సునిల్ నాయక్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటగే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, నిరుద్యోగ సమస్యలకు జైళ్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి గణేష్, డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి శాతాపురం రవి, ఎస్ఎఫ్ఐ మండల బాధ్యులు జి పంతుల్, వి శ్రీకాంత్, రమేష్, రవి కుమార్, గణేష్, రవి, రాజేందర్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.