Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
జిల్లాలో ప్రతి గ్రామంలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లను వాడుకలోకి తేవాలని జిల్లా కలెక్టర్ కె నిఖిల అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచిి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్-19, లేబర్ టర్నోవర్, స్మశానవాటికలు, సెగ్రిగేషన్ షెడ్లు, హరితహారం తదితర కార్యక్రమాలపై మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, వైద్యాధికారులు, ఎంపీఓలతో సమీక్షించి కలెక్టర్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయ న్నారు. అన్ని గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరు చేయడం, వర్మీ కంపోస్టు తయారు ప్రక్రియ చేప ట్టాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. పూర్తయిన పనులకు వంద శాతం ఎఫ్టీఓలు అప్లోడ్ చేయాలన్నారు. ప్రతి గ్రామంలో రోజు వందమంది ఉపాధి హామీ కూలీలను పనులకు సమీ కరించాలని అన్నారు. కూలి రూ.200కు తగ్గకూ డదని అన్నారు. జిల్లాలో పెద్దతండా, తమ్మడపల్లి, తిమ్మాపూర్ మినహా అన్ని గ్రామాల్లో శ్మశానవాటికలు పూర్తయ్యాయని అన్నారు. పూర్తయిన పంట కల్లాల నిర్మాణాలకు వారంలోగా ఎఫ్టీఓలు పూర్తిచేయాలని అన్నారు. తెలంగాణాకు హరితహారం కింద నర్సరీల్లో సీడ్ జెర్మినేషన్ వంద శాతం పూర్తి చేయాలన్నారు. ప్రతి నర్సరీలో నాలుగు ప్రాథమిక బెడ్లు, ఒక్కో బెడ్ లో వేయి మొక్కల చొప్పున డ్రమ్‌స్టిక్, కృష్ణ తులసి, లేమన్ గ్రాస్, టోకోమో, తంగేడు మొక్కలు ఉండాలన్నారు. షెడ్యూల్ ప్రకారం మొక్కలకు నీరందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కల మనుగడ వంద శాతం ఉండాలన్నారు. ఎంఎస్ వోలు, ఎంపీడీఓలు, ఎంపీవోలు గ్రామాల సందర్శ నకు షెడ్యూల్ రూపొందించి అభివృద్ధి పనుల లోటుపాట్లు నివేదిక సమర్పించాలన్నారు. కోవిడ్ నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలన్నీరు. రోజుకు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో 200, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో 100 మందికి తగ్గకుండా వ్యాక్సినేషన్ చేయాలన్నారు. డీఆర్డీవో జి. రాంరెడ్డి, డీఎంహెచ్ఓ ఏ మహేందర్, డీపీఓ రంగాచారి, హౌసింగ్ డీఈ దామోదర్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.