Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
కోవిడ్ కట్టడికి వివిధ శాఖల అధికారులు సమ న్వయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజ్ఞా సమావేశ మందిరం లో జిల్లా యంత్రాంగంతో సమాశమై కలెక్టర్ మాట్లాడారు. మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగించడం, భౌతిక దూరం పాటించడం వంటి అంశాలను పటిష్టంగా అమలు చేసేందుకు పాత్రి కేయ సమావేశాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. నానాటికి కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నది అన్నారు. వైద్యాధి కారులు ర్యాపిడ్ టెస్టుల సంఖ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో, 125 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలో 250 టెస్టులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 400 పెంచుకుంటూ పోవాలని అన్నారు. ఆర్టిఫిషియల్ టెస్టులలో కూడా పీహెచ్సీ స్థాయిలో 10 కమ్యూ నిటీ హెల్త్ కేంద్రాల్లో 20 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50 టెస్టులు లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. జిల్లాలో సుమారు ఏడు లక్షల పైగా జనాభా ఉందని ఇందులో 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు మూడు లక్షల మంది దాకా ఉంటారని, వారిలో కనీసం 30 శాతం మందైనా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. అధికారులందరూ తమ శాఖ సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని సదరు నివేదికలు కూడా సమర్పించాలని ఆదేశిం చారు. గత నెలలో 90 పాజిటివ్ కేసులు నమోద వ్వగా ఏప్రిల్ మొదటి వారంలోనే 90 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. పండుగలు పెండ్లిళ్లు, జాతర్లు ఉత్సవాల్లా జరుపుకోరాదని విజ్ఞప్తి చేశారు. ఫంక్షన్ హాల్స్‌లో వందమందికి మించి అను మతివ్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ... కోవిడ్ నిబంధనలు అతి క్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆటో, ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు ఆర్టీసీ సిబ్బంది రేషన్ షాప్ డీలర్లు, మీసేవ కేంద్రాలు మాల్స్ కీపర్లు, ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. నిబంధనలను ఖాతరు చేయని షాపులను సీజ్ చేయాలని ఆదేశించారు. పాత్రికేయులు కూడా కుటుంబ సభ్యులతో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీఓ కొమరయ్య, జెడ్పీ సీఈఓ సన్యాసయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యా చందన, డీఎంహెచ్ఓ శ్రీరామ్, డీఈఓ సోమ శేఖరశర్మ, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ పర్యవేక్షకులు వెంకట రాములు, ఉప వైద్యాధికారి అంబరీష, కోవిడ్ నోడల్ అధికారి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
మాస్కు ధరించకుంటే జరిమానా : గుండె బాబు
తొర్రూరు : కరోనా నియంత్రణ చర్యలు పకడ్బందీగా అమలు చేస్తామని, మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ గుండె బాబు తెలిపారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మాస్కులు ధరించకుండా తిరుగుతున్న వారికి జరిమానా విధించారు. ఒక్కొక్కరికి రూ.200 చొప్పున ఏడుగురికి రూ.1400 జరిమానా విధించారు. బస్టాండ్, మార్కెట్లు, లేబర్ అడ్డాలు, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు భౌతికదూరం పాటించాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించడం తప్పనిసరన్నారు. వ్యాక్సిన్ పై అపోహలు నమ్మొద్దన్నారు. తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ కొమ్ము దేవేందర్ పాల్గొన్నారు.