Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మహిళలను చిత్ర హింసలకు గురి చేసి, బలవంతంగా వ్యభిచారం చేయించిన వ్యక్తి పై కేసు నమోదు చేసిన సంఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై బాదావత్ రవి తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత, గిరిజన మహిళ తన భర్తతో కుటుంబ కలహాలు చెలరేగిన క్రమంలో తన రెండెండ్ల కుమార్తెతో ఎనిమిది నెలల క్రితం తూర్పు గోదావరి జిల్లా ఏటా పాక మండలం పాత కొండపల్లిలోని పుట్టింటికి వెళ్ళింది. ఇదే గ్రామానికి చెందిన భూక్య సర్వేష్ మహిళ పుట్టింటికి వెళ్ళి.. నీ భర్త తీసుక రమ్మని చెప్పాడండూ మాయా మాటలు చెప్పి హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని సర్వేష్ ఉంటున్న రూమ్కుతీసుకెళ్లి బంధించాడు. శరీరం పై సిగరెట్ తో కాల్చి, మహిళలతో వ్యభిచారం చేయించాడు. అడ్డు వచ్చిన బాధిత మహిళ కూతురును సైతం సిగరెట్ తో కాల్చాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవి తెలిపారు.