Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం, అపరాల నిల్వలు
ఏజెన్సీలో అక్రమ దందా...
- తనిఖీల్లో బట్టబయలు
నవతెలంగాణ-వెంకటాపురం
ఏజన్సీ ప్రాంతం అక్రమ వ్యాపారాలకు నిలయంగా మారింది. నిత్యం లక్షలాది రూపాయల అక్రమ వ్యాపారం సాగుతున్నా నామ మాత్రపు దాడులతో అధికారులు చేతులు దులుపుకుంటు న్నారు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలు మొదలు ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని తాల్లగుడెం, భద్రకాళి, చందూరు, దుద్దేడా, భూపాలపట్నం, మద్దెడు ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ధాన్యం, అపరాలను కొందరు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎలాంటి అనుమ తులు లేకుండానే వెంకటాపురం ప్రాంతంలో భారీ ఎత్తున నిల్వలు ఉంచుతున్నారు. కొందరు దళారులు అపరాలు, విత్తనాలు భారీగా నిల్వలు చేసినట్టు వచ్చిన సమాచారం మేరకు మండల కేంద్రంలోని పంచాయతీ కార్యలయం సమీపంలోని ఓ గోడౌన్తో పాటు వెంకటే శ్వరస్వామి ఆలయం సమీపంలోని మరో రెండు నివాస గృహల్లో పోలీసులు, వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖల ఆద్వర్యంలో సంయుక్త దాడులు నిర్వహించారు. 120 బస్తాల మినుములు, 67 బస్తాల పెసలు, 9 బస్తాల బొబ్బర్లు, 368 బస్తాల జనుము విత్తనాలు ఉన్నట్టు గుర్తిం చారు. మండల కేంద్రంలో రైతులనుంచి దళారులు కొనుగోలు చేసిన అపరాల నిల్వలు ఇంకా భారీగానే ఉన్నట్టు సమాచారం. అపరాల నిల్వలపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి నిల్వలను స్వాధీనం చేసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.
అధికారుల ఉదాసీనత ?
ఏజెన్సీ దళారులపై స్థానిక అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్న సమయంలో హడావుడి చేసిన అధికారులు తిరిగి దళారులకు ఆనిల్వలను అప్పగిస్తుండటంతో అక్రమ వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేవారు లేకుండా పొయారు. గతంలో వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలోని ఓ వ్యాపారి నివాసంలో సుమారు రూ.20 లక్షల విలువ చేసే ధాన్యం, జొన్నలు, మినుములు, పత్తి, బొబ్బర్ల నిల్వలను 2018 పిభ్రవరిలో అప్పటి తహసీల్దార్ పాలకుర్తి భిక్షం, వ్యవసాయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు, సమీపంలోని ఓ నివాస గృహంలో ఏకంగా విత్తనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 4కేజీల సంచుల్లో పెసలు, మిను ములను నింపి ఛత్తీస్ఘడ్ రాష్ట్ర రైతులకు విత్తనా లు అని నమ్మించి విక్రయిస్తున్నట్టు విశ్వనీయ సమాచారంతో సదరు నివాస గృహంలో దాడులు నిర్వహించారు. ఆ సమయంలో విత్తనాలు సంచు ల్లో నింపి ప్యాకింగ్ చేస్తున్న యంత్రాన్ని, ఖాళీ సంచులను గుర్తించారు. సదరు వ్యాపారి పై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మండలంలో జరుగుతున్న అక్రమ నిల్వలపై ఉన్నాతాధికారులు దృష్టి సారించి పూర్తిస్థాయిలో విచారించి ధళారుల పై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ఏజన్సీ చట్టాల ప్రకారం చర్యలు
మినుములు, పెసర్లు, విత్తనాలు గోడౌన్లలో నిల్వ ఉంచారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించాం. ఈ దాడుల్లో పట్టుబడ్డ నిల్వల పై ఏజెన్నీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసాం. నిల్వలను స్వాదీనం చేసుకున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుంటాం.
-ఇన్చార్జి వ్యవసాయ అధికారి వాజీద్ మహ్మద్