Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-తాడ్వాయి
అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళౄ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బుధవారం మండలం లోని లింగాల గ్రామంలో మొన్న జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు ఇండ్లు పూర్తిగా దగ్దం కాగా వారి కుటుంబాలను ఆమె పరామర్శించి మాట్లాడారు. ప్రభుత్వం నుండి బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూం మంజూరు కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదర కోళ్ల తిరుపతి, మాజీ ఎంపీటీసీ రాజు ఉకే పగడయ్య,నారాయణ, సర్పంచ్ మౌనిక, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు