Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్కు రెబల్స్ బెడద
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లో పాల్గొన్న ఇనుగాల
- ఓటర్ లిస్ట్ అస్తవ్యస్తం
- అభ్యర్థులకు తప్పని ఇక్కట్లు
నవతెలంగాణ-సంగెం
ఈనెల 16న జరగబోయే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సంగెం ఎన్నికలకు మొదటిరోజు పన్నెండు నామినేషన్లు దాఖలయ్యాయి. సొసైటీలో మొత్తం 2884 ఓటర్లు ఉండగా ఒక్కో వార్డుకు 221 ఓటర్ల చొప్పున 13 వార్డులుగా విభజించారు. మొదటి రోజు బుధవారం 12 నామినేషన్లు రావడం గమనార్హం. టీఆర్ఎస్ నుండి ఏడు నామినేషన్లు కాంగ్రెస్ నుండి
ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ నుండి చైర్మెన్ అభ్యర్థి వేసిన వార్డు నుంచి దాదాపు నాలుగు రెబల్ నామినేషన్లు దాఖలవ్వడం టీఆసెస్లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు. సహకార సంఘం ఎన్నికలకు ఓటర్ల లిస్టులో గ్రామాల వారీగా ఓటర్ల పేర్లు లేకపోవడం వల్ల గందరగోళం నెలకొన్నది. రెవెన్యూ డివిజన్ విభాగం ఆధారంగా ఓటర్ లిస్టు తయారవడంతో ఓటర్లను గుర్తించడంలో అభ్యర్థులు ఎనలేని పాట్లు పడే పరిస్థితి నెలకొన్నది. నామినేషన్ వేసే అభ్యర్థికి ఇద్దరు ప్రతిపాదించే ఓటర్లు దొరకడం చాలా ఇబ్బందిగా మారింది. వారి సొంత గ్రామంలో ఉన్న ఓటర్లు మాత్రమే వాళ్లను గుర్తుపట్టే పరిస్థితి. కానీ, సొసైటీ పరిధిలో ఉన్న మిగిలిన గ్రామాల్లో ఉన్న ఓటర్లు గజిబిజి వ్యవస్థ వల్ల ఎవరికి ఎవరు అన్నది గుర్తుపట్టక పోవటం వల్ల ప్రతిపాదించే ఓటర్లు దొరకడం కష్టంగా మారింది. నేడు చివరి రోజు కావడం వల్ల అభ్యర్థులు పూర్తిగా ఎవరెవరు అనేది తేలనుంది. దీంతో సొసైటీలో టీిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ అనివార్యం కానుంది.