Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేయాలి
- పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-నయీంనగర్
దేశంలో, రాష్ట్రంలో బీజేపీ పతనం ప్రారంభమైందని, వరంగల్ కర్పొరేషన్ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలోని 26 డివిజన్లలో టీఆర్ఎస్ జెండా ఎగరేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం హన్మకొండ స్నేహనగర్ ఎస్వీ కన్వెన్షన్ హాల్లో చీఫ్‌విప్ దాస్యం వినరు భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ విస్తతస్థాయి సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీ రెచ్చగొట్టి బోడ సునిల్నాయక్ ఉసురు తీసిందని ఆరోపించారు. నిరుద్యోగులకు బీజేపీ సమాధానం చెప్పాలని, మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని బీజేపీ నేతలను నిలదీ యాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్పై, ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను ప్రజలు విశ్వసించడం లేదని అన్నారు. రైల్వే ప్లాట్ ఫారం మీద టీ అమ్మిన మోడీ ఆ రైల్వేను అమ్మేశాడని ఎద్దేవా చేశారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తే ఎప్పటికీ ఉద్యోగాలు, రిజర్వేషన్లు రావు అన్నారు. త్వరలో రానున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాల న్నారు. ఉగాది నుండి వరంగల్ మహా నగరంలో ఇంటిం టికీ మంచినీరు అందించనున్నామని, అంబేద్కర్ జయంతి ఈ నెల 14న ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారం భిస్తారని అన్నారు. వేలాది కోట్లతో వరంగల్‌ను అభివద్ధి చేస్తున్నామని, ప్రతి ఒక్క కుటుంబానికి కనీసం రూ.5 లక్షల లబ్ధి చేకూరేల ఎంపవర్మెంట్ స్కీంను త్వరలోనే ప్రారంభిస్తునమని తెలిపారు. పార్టీ అధిష్టానం నిర్ణయించే అభ్యర్థుల ందరిని గెలిపించి బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. పార్టీ కార్య కర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తమ దేనన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... ప్రతి నెలా కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు పెట్టి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మంచి సంప్రదాయాన్ని వినరు భాస్కర్ కొనసాగిస్తున్నారని అన్నారు. కొన్ని పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, వాటిని కార్యకర్తలు తిప్పి కొట్టాలని అన్నారు. వచ్చే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. 60 లక్షల సభ్యత్వం గల పెద్ద పార్టీ టీఆర్ఎస్ అని తెలిపారు. అనంతరం చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్ మాట్లాడుతూ... వరంగల్‌లో బీజేపీ నేతలకు తిరిగే మొఖం లేదని, ముసుగులు వేసుకొని తిరుగుతున్నారని అన్నారు. కోచ్ ఫ్యాక్టరీ తేకుండా వరంగల్ కు వస్తే వారిని వరంగల్ లో ప్రజలు తిరగనివ్వరని అన్నారు. ఈ నెల 14న వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నట్టు తెలి పారు. పలు అబివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకు స్థాపనలు చేసి, అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారన్నారు. త్వరలో జరుగనున్న మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై పార్టీ శ్రేణులతో సమావేశం ఉంటుందని తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన రజక, నాయీబ్రాహ్మణులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ... మరో మూడు రోజుల్లో పార్టీ సభ్యత్వం పూర్తి చేయాలని కార్యకర్తలకు సూచించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఆప్తుడు దాస్యం వినరు భాస్కర్ రెడ్డి అని తెలిపారు. సభ్యత, సంస్కారం లేకుండా కొందరు నేతలు, కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయని, ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్దే నని అన్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పోటీనే కాదని, కాంగ్రెస్‌కు ఆ స్థాయి లేదని విమర్శిం చారు. ఆ రెండు పార్టీలను మట్టి కరిపించి, వరంగల్ కార్పొరేషన్ని సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మెన్ మర్రి యాదవ్రెడ్డి, రైతు రుణ విమోచన సమితి చైర్మెన్ నాగుల వెంకటేశ్వర్లు, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్లు సంఘం సుందర్‌రాజ్‌యాదవ్, జనార్ధన్‌గౌడ్, తాజా మాజీ కార్పొరేటర్ బోడ డిన్న, మిడిదొడ్డి సప్న, సిరంగి సునీల్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నలబోల సతీష్, ఉడుతల సారంగపాణి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.