Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజిపేట
కరోనా వైరస్ బారిన పడి కాజీపేట రైల్వే కోవిడ్ ఆస్పత్రిలోని చికిత్స పొందుతున్న పేషెంట్లకు, ఆస్పత్రి సిబ్బందికి రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమనికి కాజీపేట రైల్వే పాలి క్లినిక్ డాక్టర్ నిరంజన్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ అధ్య క్షులు కాలువ శ్రీనివాస్ హాజరై భోజనాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో కాజీపేట కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 40మందికి చికిత్స అందిస్తున్న సిబ్బందికి ఐదు రోజుల పాటు మధ్యాహ్నం రాత్రి వేళలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఓబీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ జోనల్ అధ్యక్షులు సంతోష్ కుమార్, తెలంగాణా రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్, చైర్మెన్ కొండ్ర నర్సింగారావు కో, కన్వీనర్లు పాక వేదప్రకాష్, భీష్మదేవ్, అనుమాల శ్రీనివాస్, నాగేష్, టోనీ, ప్రేమ్ కుమార్, భాస్కర్, బెల్లం రమేష్, రావు, రాజు, జిట్టా రాజలింగం, రాసగట్ల రవి, నర్సింగ్, సత్యనారాయణ పాల్గొన్నారు..