Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీటీసీ చాడ సరిత ప్రతిపాదన
- ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారం
- ఆనందం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు
నవతెలంగాణ-వేలేరు
మండలంలోని 14 గ్రామాల్లోని 4364 ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాల ఉపాధికి ఎస్సీ కార్పొరేషన్ పైలెట్ స్కీమ్ ద్వారా మినీ డెయిరీ ఏర్పాటు కొరకు సర్వే నిర్వహణకు మండల పంచాయతీ అధికారికి ఆదేశాలు రావడంతో సర్వే నిర్వహిస్తున్నారు. వేలేరు మండలంలో జెడ్పీటీసీ చాడ సరిత విజేందర్రెడ్డి ప్రతి పాదనకు రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతో ఈ స్కీంకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనుమతి వచ్చినట్టు తెలిసింది. ఎస్సీ కార్పొరేషన్ అనుమతి ద్వారా వేలేరు మండలంలో పంచా యతీ కార్యదర్శుల ద్వారా సర్వే నిర్వహిస్తున్నట్లు మండల పంచాయతీ అధికారి రవి తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ చాడ సరిత మాట్లాడుతూ మినీ డైరీల ఏర్పాటుకు నీటి సౌకర్యంతో కూడిన కనీసం 20 గుంటల వ్యవసాయ భూమి, గత ఐదు సంవత్సరాలుగా ఎటు వంటి లోన్లు పొందకుండా ఉన్న ఎస్సీ కుటుం బాలు అర్హు లని, ఒక్కొక్క మినీ డెయిరీ యూనిట్ ఏర్పాటుకు నాలుగు లక్షల రూపాయలు మంజూరు అవుతాయన్నారు. దీనిలో 60 శాతం అనగా రెండు లక్షల నలభై వేల రూపాయలు సబ్సిడీ, ఒక లక్షా అరవై వేల రూపా యలు బ్యాంకు లోను ద్వారా లబ్ధిదారులకు అందనునున్నాయని, నిబంధనల మేరకు లబ్దిదారుల ఎంపిక జరగనుందని తెలిపారు. ఎస్సి కుటుంబాల ఉపాధికి ఇది ఉపయోగపడుతుందనే ఆశయంతో ప్రతిపా దించినట్లు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకరించారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని కోరారు.