Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెదజల్లుతున్న దుర్వాసన
- ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- పట్టించుకోని శానిటేషన్ కాంట్రాక్టర్లు
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో ఉన్న మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. దీంతో అక్కడి పరిసరాలు దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగబోయే ఎలక్షన్ల దష్యా అనేక మంది ప్రజలు అధికారులు బల్దియా ప్రధాన కార్యాల యానికి రావడం జరుగుతుంది. దీంతో అక్కడ వెదజల్లే దుర్వాసన వల్ల నిలిచివుండాలంటే ముక్కున వేలేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. బల్దియా సమావేశ మందిరం పక్కనే ఉన్న మరుగుదొడ్లు అపరిశుభ్రానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయని పలువురు వాపో తున్నారు. మరుగుదొడ్లను శుభ్ర పరచడంలో సానిటేషన్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది. అధికా రులతో రాజ కీయ నాయకులతో సిబ్బందితో ఇటీవల చాలా సార్లు సమావేశాలు నిర్వహి స్తు న్నారు. పురపాలక ఎలక్ష న్లను దష్టిలో పెట్టుకుని ఎక్కువసార్లు కలెక్టర్లు కమిషనర్ సైతం వస్తారని తెలిసినప్పటికీ మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాని టేషన్ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మరుగుదొడ్ల అపరిశుభ్రంగా మారాయని ప్రజలు మండి పడు తున్నారు. ఇప్పటికైనా శానిటేషన్ కాంట్రాక్టర్లు చొరవ తీసుకుని మరు గుదొడ్లను పరిశుభ్రంగా ఉంచే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు.