Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ కలెక్టర్ హరిసింగ్
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
గ్రామాల్లో ఉపాధి హమీ పనుల బాధ్యత పూర్తిగా గ్రామ పంచాయతీలదేనని, ప్రతి జాబ్కార్డుకు 100 రోజుల పనిదినాలు కల్పించేలా ప్రణాళికతో ముందుకు సాగాలని అడిషినల్ కలెక్టర్ హరిసింగ్ అన్నారు. నెక్కొండ మండల పరిషత్ కార్యాలయంలో నెక్కొండ, చెన్నా రావుపేట మండలాల కార్యదర్శులు, ఉపాధి హమీ సిబ్బందితో జరిగిన సమీక్షా సమావేశానికి అడిషినల్ కలెక్టర్, జెడ్పీ సీఈఓ రాజారావు, డిఆర్డీఓ సంపత్రావు, డీపీఓ చంద్రమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా పనుల పురోగతి, కూలీలకు పనుల కల్పన, వేతనాలు, పనిదినాలపై సమీక్షించారు. ప్రతి గ్రామంలో రోజుకు 150 మంది కూలీలు తగ్గకుండా హాజరయ్యేలా పనులు కల్పిం చాలని, ప్రతి జాబ్ కార్డుకు 100 రోజులకు తక్కువ కాకుండా ఆర్ధిక సంవత్సరంలోని ఈ సీజన్లో పనులు కల్పించాలన్నారు. వేసవి దృష్ట్యా కూలీలకు పని ప్రదే శంలో వసతులు, అలవెన్సులతోపాటు గరిష్ట వేతనం పొందేలా పను లు జరుగాలన్నారు. చెరువులు, కుంటల్లో నీళ్లు ఉన్నందున పథకంలో ఉన్న కొత్త పనులను గుర్తిస్తూ గ్రామాల్లో చేయాలని, రైతు పంట చేళ్లలో ఫారం పాండ్ల నిర్మాణాలకు అధిక ప్రాధాన్య మివ్వాలన్నారు. కూలీల సంఖ్యను పెంచుతూ వారంలో ప్రతి గ్రామంలో 1500 పని దినాలు జరుగా లన్నారు. అతి తక్కువ పనిదినాలు కల్పించిన సిబ్బందిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి పనులు, పారిశుద్ద్యం, నర్సరీల నిర్వాహణను బాధ్యతతో చేయాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఏపీడీ సాయిచరణ్, నెక్కొండ, చెన్నారావుపేట ఎంపీడీఓలు సాహితీమిత్ర, లలిత, ఎంపిఓ రవి, ఏపిఓ జాకబ్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హమీ సిబ్బంది పాల్గొన్నారు.