Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖిలా వరంగల్
వ్యాకిన్తో కరోనా వైరస్ నుంచి రక్షణ పొందవచ్చని, అందు వలన ప్రతిఒక్కరూ తప్పని సరిగా కరోనా వ్యాక్సిన్ వేయిం చుకోవాలని టీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు శామంతులు శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన పుప్పాలగుట్టలోని పీహెచ్సీ సెంటర్లో కరోనా నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్ వేయిం చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలందరూ తప్పకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, అత్య వసరమయితేనే బయటకు వెళ్లాలని తెలిపారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, ప్రతి అరగంటకు ఒకసారి చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించారు.