Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ ఆకుతోట రాజేష్
నవతెలంగాణ-శాయంపేట
గ్రామాలలోని కూలీలు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా కేంద్రర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామా లలో చేపడుతున్న ఉపాధి హామీ పథకం పను లను కూలీలు సద్విని యోగం చేసుకోవాలని సర్పంచ్ ఆకుతోట రాజేష్ అన్నారు. మండ లంలోని నేరేడుపల్లి గ్రామంలో మావిళ్ళకుంటలో ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న చెరువు పూడికతీత పనులను శుక్రవారం సర్పంచ్ రాజేష్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న పనులలో కూలీలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని పనులు చేపట్టాలని సూచించారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తా మన్నారు. కూలీల డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కటకం రాజ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రాజు, కూలీలు పాల్గొన్నారు.