Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఆదేశాలు
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి రూ.2వేలు ఆర్థిక సహాయం, బియ్యం అందిం చేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పౌరసరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లా అధికా రులను ఆదేశించారు. శుక్రవారం ఆర్థిక, విద్య, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్, పట్టణాభివవృద్ధిశాఖల ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మతో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు, పౌరసరఫరాలశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రయివేటు ఉపాధ్యాయలు, నాన్ టీచింగ్ సిబ్బంది పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం గుర్తించి ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నదన్నారు. పాఠశా లలు ప్రారంభమయ్యేవరకు ప్రతి నెలా రూ.2వేలు, 25 కిలోల బియ్యం అందించేందుకు కృషి చేస్తున్నదని అన్నారు. జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో మార్చి 2020 నాటికి పనిచేస్తున్న ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది వివరాల్ని ఈనెల 16వ తేదీలోగా సేకరించి స్క్రూట్ని చేసి 18 లోగా ప్రభుత్వానికి నివేదిక అందించాలని అన్నారు. 20 తేదీ అనంతరం ఆర్థికాసాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రోజురోజుకు కరోనా వైరస్ తీవ్రతమవుతున్నందున మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధి ఫ్రంట్ లైన్ వర్కర్లందరికి కరోనా వ్యాక్సిన్ ఇప్పించాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 69 ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలో 709 మంది ఉపాధ్యాయులు, 32 మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు. ములుగు జిల్లాలో 46 ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో 413 మంది ఉపాధ్యాయులు పనిచే స్తున్నారని అన్నారు. వీరి వివరాలు పరిశీలించి ఆర్థిక సహాయం మరియు బియ్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఎంఈఓ లతో సమావేశం నిర్వహించి మండలాల వారీగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలను వెంటనే సేకరించి అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో జేసీ కూరాకుల స్వర్ణలత, డీఈఓ అబ్దుల్ హై, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ రాఘవేందర్, ఎంఈఓలు, విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు మనోహర్నాయక్, హరిక్రిష్ణ, ఏడీ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.