Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
పట్టణాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో భూపాలపల్లి మున్సిపాలిటీలో రూ.45లక్షలతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులు తక్కువ సంఖ్యలో ఉన్నా పట్టణ సీసీ రోడ్లను శుభ్రం చేసేందుకు ఈ మిషన్ ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం మున్సిపాలిటీ పరిధి జవహర్‌నగర్ కాలనీ 8వ వార్డు లో తాగునీటి ఇబ్బందులుగుర్తించి వాటర్ ట్యాంకర్ ను ప్రారంభించారు. భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్ వెంకటరాణిసిద్ధు, వైస్ చైర్మెన్ కొత్త హరిబాబు, కమిషనర్ బిర్రు శ్రీనివాస్, కౌన్సిలర్లు శిరుప అనిల్, ముంజల రవి, జక్కం రవికుమార్, నూనె రాజు, చల్ల రేణుక, మేకలరజిత మల్లేష్, పిల్లలమర్రి శారద నారాయణ, తోట్ల సంపత్, బద్ది సమ్మయ్య, ముంజంపల్లి మురళి, కమలహరీష్రెడ్డి , శిరీష దేవేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
చిట్యాల : అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దావు వినోదవీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమ ఇసుక రవాణా కట్టడికి చర్యలు తీసుకోవాలని తాసిల్దారు రామారావును ఆదేశించారు. మండలంలో అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యేట్టు అధికారులు చొరవ తీసుకోవాలని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. కరోనాతో దేశమంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. ధరణి రైతులకు మేలు చేకూర్చు తున్నదన్నారు. అనంతరం 112 మంది లబ్ధిదా రులకు రూ.కోటి29లక్షల92వేల విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులు, తొమ్మిది మంది లబ్ధిదారులకు రూ.లక్ష32వేల600 సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు. అంతకు ముందుచింతకుంట రామయ్య పల్లె గ్రామానికి చెందిన సర్పంచ్ మధు వంశీకృష్ణ ఎంపీటీసీ అనిల్ మాట్లాడుతూ ప్రతి సర్వసభ్య సమావేశానికి ఎక్సైజ్ అధికారులు హాజరు కావట్లేదని బెల్టు షాపులపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. జెడ్పీటీసీ గొర్రె సాగర్, పీఏసీఎస్ చైర్మెన్ కుంభం క్రాంతికుమార్‌రెడ్డి, ఎంపీడీఓ రవీంద్రనాథ్ పాల్గొన్నారు.
పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల్లో ఆహ్లాదకరం
పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రం లోని పల్లె పకృతి వనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలు పల్లె ప్రకృతి వనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీపీ వినోదవీరారెడ్డి, ఇన్చార్జి సర్పంచ్ పూర్ణచందర్రావు, ఎంపీటీసీ పద్మ నరేందర్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుంభం రవీందర్ రెడ్డి కోఆప్షన్ నెంబర్ ఎండి రాజ్ మహ్మద్ పాల్గొన్నారు.