Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 2000 ఇవ్వడం దారుణం
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి ఎండీ రహీం
నవతెలంగాణ-నయీంనగర్
ప్రయివేటు టీచర్లకు రూ. 2000వేలు ఇవ్వడం దారుణమని వారికి బిక్షం ఇస్తున్నావా అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి ఎండీ రహీం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమా వేశంలో మాట్లాడుతూ నలుగురు ప్రయివేటు ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్న తర్వాత కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ రూ. 2000 ప్రకటించడం అంటే నిజంగా వారి ఆత్మస్థైర్యం దెబ్బ తీయడం అవుతు ందన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం రాజభోగాలు అనుభవిస్తూ నెలకి రూ. 43, 0000 జీతం తీసుకుంటూ, తెలంగాణ కోసం జీవితాలు, జీతాలు పణంగా పెట్టి పోరాడిన మా ఉపాధ్యాయులకు బిక్షం వేసినట్లు 2000 ఇస్తావా అంటూ మండి పడ్డారు. వెంటనే ప్రయివేటు విద్యాలయాల, కళా శాల యాజ మాన్యాలు కరోనా కాలం నుంచి జీతాలు ఇవ్వాలని ప్రభుత్వ పరంగా ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఉగాది పండుగ నాడు ప్రయి వేటు ఉపాధ్యాయుల కుటుంబాలు పస్తు లుండకుండా ఈరోజు నుంచి రూ. 10000 చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.