Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనంగా ఉపాధి పనుల పర్యవేక్షణ
- జీపీఎస్‌లకు మూడు నెలల కోసారి వేతనాల చెల్లింపు
- అసిస్టెంట్ ఇవ్వాలని వినతి
నవతెలంగాణ-శాయంపేట
గ్రామపంచాయతీ కార్యాలయాలలో విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ కార్యదర్శులు శానిటేషన్ పనులు, వీధి దీపాల పర్యవేక్షణ, తాగునీరు సరఫరా, ఇంటినల్లా పన్నుల వసూలుతో పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివద్ధికి ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపడుతున్న శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, గ్రామ నర్సరీ, పల్లె ప్రకతి వనం పనుల పర్య వేక్షణతో పాటు, ఉపాధి హామీ పథకం పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంతో పంచాయతీ కార్యదర్శులపై పనిభారం పెరుగుతుంది. ఉపాధి హామీ పనులు ఫీల్డ్ అసిస్టెంట్లకు అప్పగించాలని, అసిస్టెంట్ నియమించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యద ర్శుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఆ శాఖ మంత్రి, కమిషనర్‌కు వినతి పత్రం సమర్పి ంచినప్పటికి సమస్యపై స్పందించిన పాపాన పోవడం లేదు. కాంట్రాక్టు పద్ధతిలో నియామకమైన జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు మూడు నెలల కొకసారి వేతనాలు చెల్లిస్తూ ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శాయంపేట మండలంలో 24 గ్రామ పంచాయతీలుండగా ఏడుగురు సీనియర్ పంచాయతీ కార్యదర్శిలతోపాటు, 17 మంది నూతనంగా విధుల్లో చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామంలో మల్టీ పర్పస్ వర్కర్లతో పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు, ఇంటి పన్నుల వసూళ్లు చేపడుతున్నారు.
పల్లె ప్రగతి పనులలో నిమగం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివద్ధి కోసం పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, నర్సరీ, పల్లె పకతి వనం పనులు చేపడు తోంది. వీటిపై పూర్తిగా పంచాయతీ కార్య దర్శుల పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ పనులలో అలసత్వం ప్రదర్శించిన పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులను జిల్లా కలెక్టర్ ఎం. హరిత సస్పెండ్ చేసిన సంఘటనలూ ఉన్నాయి. దీంతో పంచాయతీ కార్య దర్శులు సర్పంచుల పై ఒత్తిడి తెస్తూ పనులు వేగ వంతంగా జరిపిస్తున్నారు. డంపింగ్ యార్డు లలో వేసిన చెత్త నుంచి తడిిి, పొడి చెత్త వేరు చేయించే బాధ్యత కూడా పంచాయతీ కార్యదర్శులపై మోపింది.
ఉపాధి పనులతో భారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పద ¸కంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడంతో ఆ పనుల పర్యవేక్షణ పంచాయతీ కార్యదర్శులపై పడింది. ఉపాధి కూలీలతో పనులు చేయించడమే కాక ఆన్లైన్లో మస్టర్లు వేయడం, టెక్నికల్ అసిస్టెంట్‌తో ఎంబీ రికార్డ్ చేయించడం, కంప్యూటర్ ఆపరేటర్‌తో కూలీల ఖాతాలలో పేమెంట్ వేయించడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకంలో పంచాయతీ కార్య దర్శులు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా సోషల్ ఆడిట్లో జరిమానా చెల్లించాల్సి వస్తుందని, ఉద్యోగ భద్రత లేకుం డా పోతుందని ఆందోళన చెందుతున్నారు. గ్రామ పంచాయతీ నిర్వహణతో పాటు జనన, మరణ ధ్రువీ కరణ పత్రాల జారీ, కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేయడం, పల్లె ప్రగతి పనుల పర్యవేక్షణ తో పని భారం పెరుగు తుందని, అదనంగా ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంతో పని భారం తట్టుకోలేక పోతున్నామని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీపీఎస్‌లకు మూడు నెలల కోసారి వేతనాల చెల్లింపు
ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి ఉండాలనే సదుద్దేశంతో ఏప్రిల్ 2019లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నెలకు 15 వేల కాంట్రాక్ట్ వేతనంపై నియామకం చేప ట్టింది. జేపీఎస్‌లతో పనులు చేయించు కుంటున్నప్పటికీ వారికి చెల్లించాల్సిన నెలసరి వేతనాలు మాత్రం మూడు నెలలకోసారి చెల్లిస్తూ ఉండడంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమపై పనిభారం తగ్గించి నెలనెలా వేతనాలు చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
దాడులను అరికట్టాలి
గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శుల విధి నిర్వహణలో ప్రభుత్వ నియమ నిబంధనలను అమలు పరుస్తూ ఉంటే ప్రజల నుంచి దాడులు జరిగిన సంఘటనలు చోటు చేసు కుం టున్నాయి. పంచాయతీ కార్యదర్శుల పై జరిగే దాడులను ప్రభుత్వం నియంత్రించి, దాడులు చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.
అసిస్టెంట్‌ను నియమించాలి
పంచాయతీ కార్యదర్శులకు కాంట్రాక్ట్ బేసిక్‌లో అసిస్టెంట్‌ను నియ మించాలి. గ్రామ పంచాయతీ నిర్వ హణతో పాటు పల్లె ప్రగతి పనులు, ధ్రువీకరణ పత్రాల జారీ, ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ తో పని భారం పెరుగుతుంది. ఇదే విషయమై రాష్ట్ర కమిటీ పంచాయతీ శాఖ కమిషనర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు వినతి పత్రం సమర్పించారు. ఇటీవల మం డల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సోషల్ ఆడిట్ సమావేశానికి హాజరైన డీఆర్డీఓపీడీ సంపత్ రావుకు వినతి పత్రం సమర్పించాం. పని భారం ఒత్తిడి ఎక్కువై పంచాయతీ కార్యదర్శులు ఆత్మ హత్యలు చేసుకున్న సంఘటనలున్నాయి. ఇప్ప టికైనా ప్రభుత్వం స్పందించి పంచాయతీ కార్యదర్శు పై పని భారం తగ్గించాలి. ఫీల్డ్ అసిస్టెంట్లతో ఉపాధి పనులు చేయి ంచుకోవాలి. అసిస్టెంట్‌ను నియమించి ఆదుకోవాలి.
- రాయికంటి రాజు, పంచాయతీ కార్యదర్శుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు