Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో భవన నిర్మాణ కార్మికుల దాహార్తిని తీర్చేందుకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్ కోరారు. ఏఐటీయూసీ జయశంకర్-భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ములుగు లేబర్ కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయన అందజేసి మాట్లాడారు. ప్రతి మండలానికి రూ.10వేలు కేటాయించి చలివేంద్రాలు ఏర్పాటు చేసే ఆనవాయితీ ఉందని, ఏప్రిల్ మొదటి వారం లోనే ఏర్పాటు చేయాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. చలివేంద్రాల ఏర్పాటుకు నిధులు ఖర్చు చేయకుండా చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసుకొని డబ్బులు దండుకుంటున్నారని అన్నారు. కార్మికుల పట్ల నిర్లక్ష్య ధోరణ వీడకుంటే ధర్నా చేపడతామని హెచ్చరించారు. మృతిచెందిన భవన నిర్మాణ కార్మికుల క్లైమ్స్ కోసం గెజిట్ సంతకం కావాలని కార్మిక శాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఎలాంటి షరతుల్లేకుండా కార్మికులకు క్లెయింలు వచ్చేలా చూడాలన్నారు. పెండింగ్ క్లైమ్స్ అన్నీ సత్వరమే కార్మికులకందేలా చూడాలన్నారు. నీలాల రమేష్, అమృతయ్య, రాజేష్, సమ్మయ్య, కర్ణాకర్, శ్రావణ్ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.