Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేద్కర్ల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం వరంగల్ రూరల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే నీలి దండు కవాతు లను జయప్రదం చేయాలని పోడేటి దయాకర్ అన్నారు. పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో శుక్రవారం కేవీపీఎస్ కార్యకర్తలు దళితవాడ మరియు వాడవాడలా వెళ్లి పూలే అంబేద్కర్ సందేశ్ యాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ ఏప్రిల్ మహనీయుల మాసంలో దళిత ప్రజలను చైతన్య పరిచే పూలే అంబేద్కర్ సందేశ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. దళితులపై జరిగే దాడులు అణచివేతలు కుల వివక్ష రూపుమాపాలని అందుకుగాను పూలే అంబేద్కర్ చూపిన పోరాట బాటలో ప్రతి ఒక్కరు నడవాలని ఉద్దేశంతో ఈ సందేశ్ యాత్రలు నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ నెల 12న హనుమకొండ లోని కాలేజ్ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నీలి దండు కవాతు నిర్వహిస్తున్నామని ఈ కవాతును దళిత యువకులు రాజ్యాంగ రక్షణను కోరుకునే సామాజిక ప్రజాతంత్ర వాదులు అందరు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు గడ్డం ఏకాంబరం, ఒగ్గు శ్రీను, నకిరేకంటి రాంచందర్, పసునూరి మహేందర్, ఒగ్గు కొమురయ్య, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.