Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికార పార్టీ ఒత్తిళ్లతోనే తిరస్కరించారని బీజేపీ ముగ్గురు పిల్లలున్నా అంగీకరించాలని కాంగ్రెస్ ఆరోపణ
నవతెలంగాణ-సంగెం
వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో 13వార్డులకు అరవై ఒక్క నామినేషన్లు దాఖలు అయ్యాయి. అందులో శుక్రవారం స్కృటినీ చేసి 11 నామినేషన్లను తిరస్కరించినట్టు ఎలక్షన్ ఆఫీసర్ నాగ నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. తిరస్కరణకు గురైన నామినేషన్లలో అసంపూర్తి సమాచారం ఇవ్వడంవల్ల, అభ్యర్థి అడ్మిషన్ నెంబర్ తప్పుగా వేయడం, ప్రతిపాదించిన వారి అడ్మిషన్ నెంబర్లు సైతం తప్పుగా ఉండడం,కొన్ని నంబర్లు వేయక పోవడం వల్ల నామినేషన్‌ను తిరస్కరించినట్టు ఆయన తెలిపారు. నా పరిధిలోని నియమాలను అనుసరించి, విదివిధానాలకు లోబడి తన బాధ్యతను తాను నిరహించినట్టు తెలిపారు. దీంతో బీజేపీ కాంగ్రెస్ నాయకులు అధికారుల తీరుపై మండిపడ్టారు. ఇష్టం వచ్చినట్టుగా నామినేషన్లను తిరస్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు పిల్లలున్నట్టుగా ఆధారలు చూపించినా కూడా నామినేషన్ తిరస్కరించ లేదని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తీగల రవీందర్ గౌడ్ మండిపడ్డారు. నవతెలంగాణపత్రిక నామినేషన్ మొదటిరోజే ఓటరు లిస్టు అస్తవ్యస్తంగా ఉందని తెలిపింది.దీనివల్ల పోటీ చేయబోయే అభ్యర్థులకు తిప్పలు తప్పవన్నట్లే జరిగిందని తిరస్కరణకు గురైన అభ్యర్థులు వాపోయారు..
ముగ్గురు పిల్లలున్న అభ్యర్థి నామినేషన్‌ను అంగీకరించారు
- మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తీగల రవీందర్ గౌడ్
1994-95 ఎన్నికల నియమావళి చట్టాల ప్రకారం ముగ్గురు పిల్లలు ఉన్నవారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ఉంది. ఈ నియమాన్ని పరిగణలోకి తీసుకుని ముగ్గురు పిల్లలున్న అభ్యర్థి మూడవ వార్డులో నామినేషన్ వేయడం వల్ల దానికి సంబంధించిన ఆధారాలను ఎలక్షన్ ఆఫీసర్‌కి అందించినప్పటికీ ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్క రించలేదు. కొత్తగూడెం గ్రామానికి చెందిన పోశాల మల్లయ్యకు ముగ్గురు మగ పిల్లలున్నారు. ఆధారాలు ఇచ్చినప్పటికి తిరస్కరించలేదు. పజాస్వా మ్యంలో ఉన్నామా? పరాయి పాలనలో ఉన్నామా అనేది అనుమానంగా ఉంది.
అధికార పార్టీకి తలొగ్గిన ఆఫీసర్
- డాక్టర్ విజరు చందర్ రెడ్డి
అధికార పార్టీ ఒత్తిళ్లకు ఆఫీసర్ తలొగ్గారు. నామి నేషన్లలో చిన్న చిన్న తప్పిదాలను, వాటిని భూతద్దంలో పెట్టి చూసి అభ్యర్థుల నామినేషన్ తిరస్కరించడం విడ్డూరంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ చెప్పిన నియమాల్లో చిన్నచిన్న తప్పిదాలను పరిగణనలోనికి తీసుకోవాల్సిన అవసరం లేదని ఒక నియమంలో ఉంది. కానీ అధికార పార్టీ రాజకీయ ఒత్తిళ్లతో తొమ్మిది మంది బీజేపీ డైరెక్టర్ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు.ఈ విషయంపై కోర్టుకు వెళ్తాం.