Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
సరైన సమయంలో వైద్యం అందించాల్సిన వైద్య సిబ్బంది కరోనా టెస్ట్ అనే నెపంతో గుండెపోటు వచ్చిన వ్యక్తికి వైద్యం అందించకపోవడంతో కేఎంసీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసే వ్యక్తి మతి చెందిన ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కాకతీయ మెడికల్ కళాశాలలో వైరాలజీ ల్యాబ్ లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మట్టెవాడ ప్రాంతానికి చెందిన సారంగపాణి (45) శుక్రవారం తెల్లవారుజామున గుండ ెపోటుకు గురికావడంతో రోగి బంధు వులు హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో రోగి ఆయా సపడుతూ ఉండడాన్ని చూసిన వైద్యులు కరోనా టెస్టు చేయించుకోవాలని రావడంతో కోవిడ్-19 వార్డు దగ్గర ఉన్న కోవిడ్ శాంపిల్ కలెక్షన్ విభాగం దగ్గరికి వెళ్ళగా అక్కడ సిబ్బంది రెండు గంటలపాటు గుండెపోటుకు గురైన వ్యక్తిని వేచి ఉండేలా చేయడంతో సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో రోగి మతి చెందాడు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కరోనా టెస్ట్ చేయకపోవడంతో గుండెపోటు వచ్చిన వ్యక్తికి సరైన వైద్యం అందక మతి చెందాడని ఆరోపిస్తూ రోగి బంధువులు ఉద్యోగులు ధర్నా చేశారు.
మతదేహాన్ని సందర్శించిన సీఐటీయూ నాయకులు
కాకతీయ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న సారంగపాణి మతి చెందిన విషయం తెలుసుకున్న మెడికల్ కళాశాల సీఐటీయూ ఉద్యోగ సంఘాల నాయ కులు జై సుధాకర్, టీఎన్జీవోస్ నాయకులు రామ్ కిషన్ రాజేందర్లు మతదేహం వద్దకి వచ్చి రెండు నిమిషాలు మౌనం పాటించి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంజీఎంలో కరోనా టెస్టులు శాంపిల్‌ను కేఎంసీలోని వైరాలజీ ల్యాబ్‌లో క్రమం తప్పకుండా ప్రతిరోజు అందించి తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి ఎంజీఎం సిబ్బంది వైద్యుల నిర్లక్షానికి మతి చెందడం బాధాకరమన్నారు.